Oscars 2021 : ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం.. ఈ సారైనా దక్కుతుందా..

Oscars 2021 : మన దేశం తరఫున 93వ ఆస్కార్‌ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘జల్లికట్టు’ అనే మలయాళ సినిమాను ఎంట్రీగా పంపించింది ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా.

news18-telugu
Updated: November 26, 2020, 7:57 AM IST
Oscars 2021 : ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం.. ఈ సారైనా దక్కుతుందా..
జల్లికట్టు పోస్టర్ Photo : Youtube
  • Share this:
మన దేశం తరఫున 93వ ఆస్కార్‌ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘జల్లికట్టు’ అనే మలయాళ సినిమాను ఎంట్రీగా పంపించింది ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా. దీనికి సంబందించిన ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. 2021 ఆస్కార్ బరిలోకి దిగేందకు అన్ని భారతీయ భాషల్లో కలిపి మొత్తం 27 సినిమాలు పోటీపడగా చివరకు ‘జల్లికట్టు’ ఎంపికైంది. ఈ చిత్రాన్ని లిజో జోస్ పెలిస్సెరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, చెంబన్‌ వినోద్‌ జోస్, శాంతి బాలచంద్రన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. జల్లికట్టు సినిమా విషయానికి వస్తే.. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న ఓ దున్నపోతు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతటి వినాశనం చేసిందనేది కథ. ఇక్కడ ఈ సినిమాలో విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ సినిమా మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఎక్కడా ఉపయోగించలేదట. సినిమా టీమ్ యానిమేట్రానిక్స్‌ ద్వారా ఓ దున్న బొమ్మలను తయారు చేశారట. ఇలా ఒక్కో దున్నను తయారు చేయడానికి సుమారు 20 లక్షల ఖర్చు అయిందట.

ఈ జల్లికట్టు దర్శకుని డైరెక్షన్‌లో వచ్చిన మరో మంచి సినిమా అంగమలై డైరీస్.. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా.. స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఫలక్‌నుమా దాస్ ఈ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. లిజో జోస్ పెలిస్సెరి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు టెక్నికల్’గానీ, కథ పరంగా గానీ ఎంతో వినూత్నంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆయన సినిమాలు గ్రామీణ నేపథ్యంలో సాగుతూ టెక్నికల్‌గా ఎంతో రిచ్’గా ఉంటూ ఆకట్టుకుంటాయి. ఈ జల్లికట్టును తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీగా పోటీబడ్డ సినిమాల విషయానికి వస్తే.. అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’తో పాటు హన్సల్‌ మెహతా ‘ఛాలెంజ్‌’, ‘ది డిసైపుల్‌’, ‘మూతాన్‌’, ‘కామ్యాబ్‌’, ‘షికారా’, ‘బిట్టర్‌ స్వీట్‌’ వంటి సినిమాలు ఉన్నాయి.
Published by: Suresh Rachamalla
First published: November 26, 2020, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading