Home /News /movies /

షూటింగ్ సెట్‌లో కుప్పకూలిన డైరెక్టర్.. బ్రెయిర్ డెడ్ డిక్లేర్ చేసిన డాక్టర్లు..

షూటింగ్ సెట్‌లో కుప్పకూలిన డైరెక్టర్.. బ్రెయిర్ డెడ్ డిక్లేర్ చేసిన డాక్టర్లు..

దర్శకుడు షానవాస్ (File/Photo)

దర్శకుడు షానవాస్ (File/Photo)

షూటింగ్ సెట్‌లో నటీనటులకు సూచనలు ఇస్తున్న దర్శకుడు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు మలయాళ దర్శకుడు నారాణిపుల షానవాజ్. దీంతో ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.

    షూటింగ్ సెట్‌లో నటీనటులకు సూచనలు ఇస్తున్న దర్శకుడు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు మలయాళ దర్శకుడు నారాణిపుల షానవాజ్. దీంతో ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అతన్ని బ్రెయిన్ డెడ్‌గా డిక్లేర్ చేసారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ దర్శకుడు షానవాజ్.. బుధవారం ఉదయం కోయంబత్తూరులో గాంధీ రాజన్ సినిమా షూటింగ్  చేస్తున్నాడు. కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని అట్టపాడి ప్రాంతంలో ‘గాంధీ రాజన్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా నటీనటులకు సూచనలు ఇస్తుండగా అనకోకుండా కుప్పకూలిపోయాడు. దాంతో ఆయన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు యూనిట్ సభ్యులు. ఇక వైద్యులు అతన్ని పరీక్షించి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ దర్శకుడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.

    దర్శకుడు షానవాస్ బ్రెయిన్ డెడ్ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన గుండె కొట్టుకుంటుందని నిర్మాత విజయ్ బాబు మీడియాకు తెలియజేసారు. ఏదైనా మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని అభిమానులు దేవుడిని ప్రార్ధించాలని కోరారు. 2015లో కైరై’ సినిమాతో మల్లూవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షానవాజ్.. ‘సూఫియం సుజాతాయుం’ అనే సినిమాతో దర్శకుడిగా మంచి పేరు గడించాడు.

    malayalam director naranipuzha shanavas collapsed on the shooting set the doctors who declared brain dead ,Malayalam director షూటింగ్ సెట్‌లో నటీనటులకు సూచనలు ఇస్తున్న దర్శకుడు ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు మలయాళ దర్శకుడు నారాణిపుల షానవాజ్. దీంతో ఆయన్ని హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. collapsed on the shooting set The doctors who declared Brain dead,షూటింగ్ సెట్‌లో కుప్పకూలిన డైరెక్టర్.. బ్రెయిర్ డెడ్ డిక్లేర్ చేసిన డాక్టర్లు..,Malayalam director Naranipuzha Shanavas,Malluwood director Naranipuzha Shanavas ,Naranipuzha Shanavas dead,Naranipuzha Shanavas died in shooting Set,malluwood,malayalam Cinema,షూటింగ్ సెట్‌లో కుప్పకూలిన డైరెక్టర్,నారనిపుల షానవాజ్,నారనిపుల షానవాజ్ బ్రెయిన్ డెడ్ షూటింగ్ సెట్‌లో కుప్పకూలిన మలయాళ డైరెక్టర్ నారనిపుల షానవాజ్
    దర్శకుడు షానవాస్ (File/Photo)


    ఈ చిత్రంలో జయసూర్య, అదితి రావు హైదరీ, దేవ్ మోహన్ నటించారు. మలయాళ దర్శకుడు షానవాజ్.. గుండెపోటుకు గురై బ్రెయిన్ డెడ్ అయిన విషయాన్ని తెలుసుకున్న మలయాళ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోని మరిన్ని సినిమాలు తెరకెక్కించాలని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ పెద్దలు ప్రార్ధిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Malayala Cinema, Malluwood

    తదుపరి వార్తలు