Video: వృద్ధి విశాల్ విశ్వరూపం... కత్తి చూపిస్తూ.. చించేసిందిగా!

వృద్ధి విశాల్ విశ్వరూపం (image credit - instagram)

Viral Girl: మన తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు గానీ... మలయాళీలకు ఈ చిట్టితల్లి అంటే విపరీతమైన ఇష్టం. అందుకే ఏ వీడియో చేసినా తుఫానులా వైరల్ అవుతోంది.

 • Share this:
  Viral Girl: ఇన్‌స్టాగ్రామ్ వైరల్ గర్ల్ వృద్ధి విశాల్... మరోసారి దుమ్మురేపింది. కన్మదం సినిమాలో... మంజు చెచి పాత్రను దించేసింది. కట్టెలు నెత్తిన పెట్టుకొని వెళ్తుండగా... గాలోళ్లు టీజ్ చేసినప్పుడు... మంజు చెచి ఎలాగైతే... వారిపై కత్తితో విరుచుకుపడిందో... అదే విధంగా వృద్ధి కూడా... కత్తి తీసి విశ్వరూపం చూపించింది. వృద్ధి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ట్రెండ్ అయ్యింది. పోస్ట్ చేసిన గంటలోనే దీన్ని 32వేల మందికిపైగా చూశారు. చూసిన వాళ్లే అదిరిపోయిందంటూ... మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఆరేళ్ల చిన్నారి ఇంత బాగా నటించడం సూపర్ అని మెచ్చుకుంటున్నారు.

  గత వారం వరకూ ఈ చిన్నారికి 5 లక్షల మందికి పైగా ఫాలోయర్స్‌ ఉన్నారు. వారం తిరిగేసరికి వాళ్ల సంఖ్య 7 లక్షలకు దగ్గర్లో ఉంది. దీన్ని బట్టీ... ఈ చిన్నారి ఎలా దూసుకుపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆ తాజా వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.  గత నెలలో పేరెంట్స్‌తో కలిసి... కేక్ కట్ చేసిన ఈ చిన్నారి... మన కుటుంబంలో అందరికీ థాంక్సూ అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. అప్పటి నుంచి ఫాలోయర్స్ మరింత పెరిగారు. మనం ముందే చెప్పుకున్నట్లు ఈ పాప... వైరల్ గర్ల్... తరచూ సోషల్ మీడియాను తనవైపు తిప్పుకుంటూనే ఉంది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో చైల్డ్ స్టార్‌గా ఎంట్రీ ఇచ్చి... చక్కటి నటనతో ఆకట్టుకుంది. నటనే కాదు డాన్స్ వేయడంలోనూ ఆరేళ్ల వృద్ధి... సంవృద్ధే. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బోలెడు వీడియోలు. వాటి నిండా నటనే. పై వీడియో లాంటిది మరొకటి ఇక్కడ చూడండి.  రీసెంట్‌గా స్నోవీ ఫ్లవర్స్ అనే సిరీస్‌లో కనిపించి సందడి చేసింది ఈ చిట్టి తల్లి. ఈ సిరీస్... చిన్నారికి ఎక్కడలేని ఫేమ్ తెచ్చిపెట్టింది. వెరీ పాపులర్ అయిపోయింది. 3 ఏళ్ల వయసు నుంచే వృద్ధి యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. మొదట్లోనే పెద్ద కంపెనీల బ్రాండ్స్, మోడలింగ్ చేసింది. 2019లో టీవీ సీరియల్ మంజిల్ విరింజ పువ్వుతో చైల్డ్ ఆర్టిస్టుగా అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పృథ్విరాజ్ సుకుమారన్ లీడ్ యాక్టర్‌గా చేసిన కడువ సినిమాలో మంచి రోలే చేసింది. ఆ తర్వాత సారా సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. అలాగే... సుడోకు మూవీలో మంచి నటన కనబరిచింది.  చిన్నారికి సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగా వస్తుండటంతో... పాప పేరున ఓ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు పేరెంట్స్. వృద్ధీది ఫొటోజెనిక్ ఫేస్. ఫొటోల్లో బొమ్మలా కనిపిస్తుందని ఫాలోయర్స్ తెగ మెచ్చుకుంటున్నారు.
  ఈ చిట్టి తల్లి తరచూ ఫొటోషూట్లు చేస్తోంది. అవి వైరల్ అవుతున్నాయి.

  ఇది కూడా చదవండి: Archana: నటి అర్చనకు షాక్.. అభిమానుల వింత రిప్లై

  నేటి చైల్డ్ స్టార్లే రేపటి సిల్వర్ స్క్రీన్ స్టార్లు కాబట్టి... వృద్ధి క్రమంగా వృద్ధి చెందుతూ... ఇప్పటి నుంచే స్టార్ యాక్ట్సెస్ వైపుగా అడుగులు వేస్తోంది.
  Published by:Krishna Kumar N
  First published: