Home /News /movies /

MALAYALAM ACTRESS MOLESTED IN SHOPPING MALL BA

షాపింగ్ మాల్‌లో షాకింగ్ సీన్, అందరూ చూస్తుండగా నటి వెనుక తడుముతూ.. అసభ్యంగా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షాపింగ్ కోసం మాల్‌కు వెళ్లిన ఓ నటికి ఊహించని ఘటన ఎదురైంది. రష్‌గా ఉన్నషాపింగ్ మాల్‌లో కొందరు యువకులు ఆమెతో బహిరంగంగానే అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె మీద చేతులేసి తడుముతూ లైంగిక వేధింపులకు గురి చేశారు.

    షాపింగ్ కోసం మాల్‌కు వెళ్లిన ఓ నటికి ఊహించని ఘటన ఎదురైంది. రష్‌గా ఉన్నషాపింగ్ మాల్‌లో కొందరు యువకులు ఆమెతో బహిరంగంగానే అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె మీద చేతులేసి తడుముతూ లైంగిక వేధింపులకు గురి చేశారు. దీనికి సంబంధించిన ఘటనను ఆ మళయాళ నటి సోషల్ మీడియాలో విషయాన్ని తెలియజేసింది. ఇద్దరు యువకులు తనతో ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించారో ఆ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. ‘ఇద్దరు యువకులు నా వెనుక నడుస్తున్నారు. అయితే, చాలా వేగంగా నడుస్తున్నట్టు నటిస్తూ అందులో ఒకడు నా వెనుక చెయ్యి వేశాడు. నన్ను తడిమాడు. ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడిచింది. కానీ, వెంటనే రియాక్ట్ కాలేదు. ఎందుకంటే తెలియక తగిలి ఉంటుందేమోనని భావించా. కానీ, ఈ విషయంపై నాకు డౌట్ వచ్చింది. కానీ, నా సోదరికి మాత్రం రాలేదు. ఆమె నాకు కొంచెం దూరంలోనే ఉంది. ఈ సీన్‌ను ఆమె స్పష్టంగా చూసింది. వెంటనే ఆమె నా వద్దకు వచ్చింది. ఏంటి బానే ఉన్నావా? అని అడిగింది. నేను బాలేను.’ అని ఆ ప్రముఖ నటి పేర్కొంది.

    ఈ ఘటన జరిగిన వెంటనే తాను షాక్‌కి గురయ్యానని ఆ నటి తెలిపింది. ‘అక్కడ ఏం జరిగిందో నా సోదరికి స్పష్టంగా తెలిసింది. అదేమీ ఊహ కాదు. నా మైండ్ ఒక్క నిమిషం బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం జరిగిందో అని గందరగోళ పడ్డా. మేం మాట్లాడుకుంటుండగానే ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. నేను కనీసం ఒక్క మాట కూడా అననందుకు చాలా కోపంగా ఉంది. నేను, నా సోదరి వెంటనే మా అమ్మ, సోదరుడికి దగ్గరకు వెళ్లాం. వారు మార్కెట్‌లో కూరగాయల కౌంటర్ దగ్గర ఉన్నారు. మా వాళ్లు కూరగాయలు తీసుకునే పనిలో ఉంటే, అంతకు ముందు వచ్చిన కుర్రాళ్లు మమ్మల్ని మళ్లీ ఫాలో అయ్యారు.’ అని తెలిపింది.

    ఆ కుర్రాళ్లు అంతటితో ఆగలేదని, ఆమెను అసభ్యంగా టచ్ చేసింది కాకుండా, ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించినట్టు ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌లోతెలిపింది. ‘వారిద్దరూ మళ్లీ వచ్చారు. ఈసారి వాళ్లని హెచ్చరించా. నీ పని నువ్వు చూసుకుని వెళ్లమని చెప్పా. ఆ సమయంలో మా అమ్మ అక్కడికి వస్తుండడంతో వారిద్దరూ వెళ్లిపోయారు. ఓ మహిళగా ఉండడం తనకు ఎంతో విసుగు కలిగిస్తోందని ఆమె ఆరోపించింది. ఇంట్లో నుంచి బయట పెట్టిన ప్రతి క్షణం నుంచి మళ్లీ ఇంటికి చేరే వరకు ప్రతి సారీ తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ‘ఇది చదివిన ప్రతి మహిళకు చెబుతున్నా. అలా చేసిన వారి చెంప చెళ్లుమనిపించడానికి నాకు లేని ధైర్యం మీకు ఉందనుకుంటున్నా.’ అని భావోద్వేగ పోస్ట్ చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Malayala Cinema

    తదుపరి వార్తలు