MALAYALAM ACTRESS BHAVANA MENON OPENS UP ON HER ALLEGED ASSAULT CASE INVOLVING ACTOR DILEEP KUMAR SRD
Bhavana : గోపిచంద్ హీరోయిన్ పై స్టార్ హీరో లైంగిక దాడి.. ఆ దారుణ ఘటనపై భావన రియాక్షన్..
Bhavana menon
Bhavana : 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు. ఇందులో స్టార్ హీరో కూడా ఉన్నాడు.
ప్రముఖ హీరోయిన్భావన (Bhavana)పై లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ సూపర్‌స్టార్ దిలీప్ కుమార్ (Dileep Kumar)పై కేరళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. లేటెస్ట్ గా భావన ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ను భావన షేర్ చేసింది.
" ఇది అంత తేలికైన ప్రయాణం కాదు. బాధితురాలి నుండి ప్రాణాలతో బయటపడే ప్రయాణం. ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి బరువుతో నా పేరు, నా గుర్తింపు అణచివేయబడింది. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానపరచడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ అలాంటి సమయంలో నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా గొంతులు వింటున్నాను. న్యాయం కోసం ఈ పోరాటంలో నేను ఒంటరిగా లేనని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను ఈ ప్రయాణం కొనసాగిస్తాను. నాతో పాటు నిలబడిన వారందరికీ మీ ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు " అంటూ రాసుకొచ్చింది భావన.
ఐదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన మలయాళ చిత్ర పరిశ్రమనే కాదు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమను కూడా కదిలించింది. ఆ తరువాత భావన నవీన్‌ను వివాహం చేసుకుంది. ఆమె ఇప్పుడు కన్నడ సినిమాలలో బిజీగా ఉంది. కొంతమంది వ్యక్తుల కారణంగా భావనకు మలయాళ ఆఫర్లు రావట్లేదని పుకార్లు కూడా ఉన్నాయి.
ఇక మరోవైపు ఈ కేసులో కేరళ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లైంగిక వేధింపులు చేసిన నేరస్థులపై క్రిమినల్ కేసును కూడా ప్రారంభించింది. ఈ కేసులో మొత్తం 6 మంది నిందితులలో దిలీప్ ఒకడు. కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ను దిలీప్ తో పాటు నిందితులు బెదిరించడంతో వారిపై మరో కేసు నమోదైంది.
కేసును పర్యవేక్షిస్తున్న పోలీసును చంపడానికి కుట్ర పన్నుతున్న ఆడియో క్లిప్ లు బయటకు రావడంతో దిలీప్‌పై మరికొన్ని ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. వారిపై IPC సెక్షన్లు 116 (ఖైదుతో శిక్షార్హమైన నేరాన్ని ప్రోత్సహించడం), 118 (మరణశిక్ష విధించదగిన నేరానికి రూపకల్పన చేయడం లేదా జీవితాంతం జైలు శిక్ష విధించడం), 120B (నేరపూరిత కుట్రకు పక్షం), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (నేరసంబంధం) కింద కేసులు నమోదు చేశారు. కొత్త ఎఫ్ఐఆర్ దిలీప్, సూరజ్, దిలీప్ సోదరుడు అనూప్, ఒక వీఐపీ మరియు మరో ఇద్దరితో సహా ఆరుగురిపై నమోదు అయ్యింది. ఈ కేసులో కేరళ ప్రభుత్వం కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.