Home /News /movies /

MALAYALAM ACTOR TOVINO THOMAS DISCHARGED FROM HOSPITAL AFTER 6 DAYS OF ACCIDENT PK

Actor Tovino Thomas: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మాలయాళ నటుడు టొవినో థామస్..

మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)

మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)

Actor Tovino Thomas: ఇండస్ట్రీలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యే. మొన్నటికి మొన్న కూడా ఓ యువ దర్శకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సుధీర్ వర్మ దగ్గర పని చేస్తూ.. ఈ మద్యే తొలి సినిమా అవకాశం అందుకున్న ప్రవీణ్..

ఇండస్ట్రీలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యే. మొన్నటికి మొన్న కూడా ఓ యువ దర్శకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సుధీర్ వర్మ దగ్గర పని చేస్తూ.. ఈ మద్యే తొలి సినిమా అవకాశం అందుకున్న ప్రవీణ్.. షూటింగ్ చేస్తుండగా కారు ప్రమాదంలో చనిపోయాడు. ఈయన కంటే ముందే టొవినో థామస్ అనే మలయాళ నటుడు కూడా ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రముఖ మలయాళ నటుడు, ఫోరెన్సిక్ ఫేమ్ టోవినో థామస్‌ తీవ్ర గాయాలతో వారం రోజుల కింద కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఈయన 'కాలా' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. అందులో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వారం రోజుల కింద ఈ ప్రమాదం జరిగితే.. మూడు రోజుల కింద జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసారు. ఓ భారీ యాక్షన్ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన్ని డిశ్చార్జ్ చేసారు. దాంతో సన్నిహితులు ఆనందంగా ఉన్నారు.

మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)
మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)


ప్రమాదం జరిగిన వెంటనే ఈయన పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు వైద్యులు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఐసియూలో చికిత్స అందించారు. కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఈయన చికిత్స అందుకున్నాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి బాగానే ఉందని తెలిపారు వైద్యులు. దాంతో థామస్‌ను జనరల్ వార్డు నుంచి డిశ్చార్జ్ చేసారు. థామస్ కడుపులో బలంగా దెబ్బ తగలటంతో ఇంటర్నల్‌ బ్లీడింగ్ భారీగానే జరిగింది. టోవినో థామస్‌కు ప్రమాదం జరిగిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాలయాళ ఇండస్ట్రీ అంతా షాక్ అయిపోయింది.

మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)
మలయాళ నటుడు టొవినో థామస్ (tovino thomas)


ఈ విషయం తెలియగానే అభిమానులు సోషల్‌ మీడియాలో ఈయనకు గెట్ వెల్ సూన్ సందేశాలు పంపిస్తున్నారు. త్వరగా కోలుకుంటుండటంతో థామస్ సన్నిహితులు ఆనందిస్తున్నారు. టోవినో థామస్‌కు మాలయాళ ఇండస్ట్రీలో హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఈ యువ నటుడు. ప్రస్తుతం ఈయన పరిస్థితి తెలిసి పాపం అంతా ఫీల్ అవుతున్నారు. ఇటీవల థామస్ నటించి 'ఫోరెన్సిక్' సినిమా తెలుగులోనూ 'ఆహా' ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో థామస్ ఇక్కడ కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malayala Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు