హోమ్ /వార్తలు /సినిమా /

Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. 37 ఏళ్లకే యువనటుడు అనుమానాస్పద మృతి..!

Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. 37 ఏళ్లకే యువనటుడు అనుమానాస్పద మృతి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నటుడు శరత్ చంద్రన్ శుక్రవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన సొంత నివాసంలోనే చనిపోయాడు.

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులు మరణిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో కొందరు మరణిస్తే.. మరికొందరు ఆత్మహత్యలు... చేసుకుంటున్నారు. పలు విభాగాలకు చెందిన టెక్నీషియన్లు అలాగే నిర్మాతలు,నటులు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

అంతేకాదు హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపించాయి. టాలీవుడ్ లో అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్,మలయాళం,పంజాబీ.. ఇలా చాలా భాషల్లోకి చెందిన సినీ ప్రముఖులు అలాగే ఫ్యాషన్ డిజైనర్ లు వంటి వారు మరణించడం చూశాం. మీనా భర్త, రాధికా శరత్ కుమార్ మాజీ భర్త, అర్జున్ తల్లి, నోయల్ తండ్రి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉందని చెప్పాలి.

ఈ మధ్యనే బాలీవుడ్ కు చెందిన కమెడియన్ దీపేష్ భన్ కూడా క్రికెట్ ఆడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం రోజులు గడవకముందే మరో యువ నటుడు మరణించాడు.మలయాళం నటుడు శరత్ చంద్రన్ శుక్రవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన సొంత నివాసంలోనే మరణించాడు. ఇప్పుడు ఈ వార్త మళయాళం ఇండస్ట్రీలో విషాదం నింపింది .ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా వంటి చిత్రాలతో ఇతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శరత్.

శరత్ కు తండ్రి చందన్, తల్లి లీలతో పాటు ఓ సోదరుడు ఉన్నారు.శరత్ నటుడు కాకముందు గతంలో ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశాడు.ఇతని వయసు 37 ఏళ్ళ మాత్రమే కావడం అందరినీ బాధ పెట్టింది. అయితే అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని డాటాను పరిశీలిస్తున్నారు.

First published:

Tags: Death, Mollywood

ఉత్తమ కథలు