Home /News /movies /

MALAYALA SUPER STAR PRITHVIRAJ SUKUMARAN TESTED CORONA POSSITIVE TA

Prithviraj Sukumaran Corona Possitive: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌కు కరోనా పాజిటివ్..

పృథ్వీరాజ్‌కు కరోనా పాజిటివ్ (Twitter/Photo)

పృథ్వీరాజ్‌కు కరోనా పాజిటివ్ (Twitter/Photo)

Prithviraj Sukumaran Corona Possitive |కరోనా ప్రస్తుతం చిన్నా, పెద్ద, బీదా, గొప్ప అనే తేడా లేకుండా అందరినీ కమ్మేస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమరన్‌కు కోవిడ్ బారిన పడినట్టు తెలిపారు.

ఇంకా చదవండి ...
    Prithviraj Sukumaran Corona Possitive |కరోనా ప్రస్తుతం చిన్నా, పెద్ద, బీదా, గొప్ప అనే తేడా లేకుండా అందరినీ కమ్మేస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అమితాబ్, రాజమౌళి, తమన్నా లాంటి వాళ్లు కరోనా బారిన పడి దాని నుంచి కోలుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి వారు కరోనా కాటుకు బలైపోయారు. ఆ సంగతి పక్కన పెడితే.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ అకౌంట్‌లో వెల్లడించాడు. ఆయన డిజో జోస్ దర్శకత్వంలో చేస్తోన్న ‘జనగణమన’ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు కరోనా సోకినట్టు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ను కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా కొచ్చి (ఎర్నాకులం)లో షూటింగ్ స్టార్ట్ చేసారు. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ 7న ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు నలతగా అనిపించడంతో డాక్టర్స్‌తో టెస్ట్ చేయించుకున్నాను. దీంతో తనకు కరోనా నిర్ధారణ అయినట్టు వెల్లడించాడు.


    దీంతో తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. తనతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న వాళ్లందరు కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాటు హోసం ఐసోలేషన్‌లో ఉండమని చెప్పాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Corona virus, Covid-19, Malayala Cinema, Malluwood news, Prithviraj Sukumaran

    తదుపరి వార్తలు