Home /News /movies /

MALAYALA SUPER STAR MOHAN LAL TO BE AWARDED WITH PADMA BHUSHAN TA

Padma Bhushan: ‘పద్మభూషణ్’ మోహన్ లాల్

మోహన్ లాల్ (Mohanlal death fake news)

మోహన్ లాల్ (Mohanlal death fake news)

Padma Bhushan Mohan Lal | భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలున్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగాడు. తాజాగా కేంద్రం గణతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆయన్ని పద్మభూషణ్‌తో సత్కరించింది. 

ఇంకా చదవండి ...
భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలున్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగాడు. తెలుగులో ఆ మధ్య ‘మనమంతా’, జనతా గ్యారేజ్’ సినిమాలతో తెలగు ఆడియన్స్‌ మనుసులు దోచుకున్నాడు.తాజాగా కేంద్రం గణతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆయన్ని పద్మభూషణ్‌తో సత్కరించింది.

గతంలో కేంద్రం ఆయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలు అందుకున్నారు. ‘భరతమ్’ ‘వానప్రస్థం’ సినిమాలకు గాను రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ‘వాన ప్రస్థం’ సినిమాకు గాను ఉత్తమ చిత్ర నిర్మాతగా మరో జాతీయ పురస్కారం అందుకున్నారు. వీటితో జాతీయ స్థాయిలో రెండు సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు.

ప్రస్తుతం మోహన్ లాల్.. త్వరలో వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్న ‘మహాభారతం’లో భీముడి పాత్ర కోణంలో సాగే ‘రండమూలం’లో భీముడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా కేంద్రం ప్రకటించిన పద్మభూషణ్‌తో ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది.

ఇవి కూడా చదవండి

Padma Shri: ’పద్మశ్రీ’ సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ.. మోహన్ లాల్‌కు పద్మభూషణ్..

తెలుగువారికి 4 పద్మ శ్రీ అవార్డులు...లిస్టులో హారిక, సిరివెన్నెల

ప్రణబ్ ముఖర్జీకి 'భారతరత్న'..నానాజీ, హజారికాకు కూడా...
First published:

Tags: Malayala Cinema, Malluwood, Mohanlal, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు