మరో యాక్షన్ ఎంటర్టేనర్‌తో ఆడియన్స్ ముందుకు వస్తోన్న మోహన్ లాల్..

మన హీరోలు పక్క ఇండస్ట్రీలను పెద్దగా పట్టించుకోరు కానీ అక్కడి వాళ్లు మాత్రం టాలీవుడ్‌పై దండయాత్ర చేస్తూనే ఉంటారు. తాజాగా మోహన్ లాల్ మలయాళంలో ‘లూసీఫర్’ సినిమాను చేసాడు. తాజాగా మలయాళ వెర్షన్‌ను సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: March 21, 2019, 3:28 PM IST
మరో యాక్షన్ ఎంటర్టేనర్‌తో ఆడియన్స్ ముందుకు వస్తోన్న మోహన్ లాల్..
మోహన్ లాల్
  • Share this:
మన హీరోలు పక్క ఇండస్ట్రీలను పెద్దగా పట్టించుకోరు కానీ అక్కడి వాళ్లు మాత్రం టాలీవుడ్‌పై దండయాత్ర చేస్తూనే ఉంటారు. ఒక్క హిట్ కానీ వచ్చిందంటే దాన్ని యూజ్ చేసుకుంటూ వరస సినిమాలు చేస్తూనే ఉంటారు.. ఇక్కడ విడుదల చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా ఇప్పుడు వరసగా తెలుగులో తన సినిమాలను తీసుకొస్తున్నాడు. ఒకవైపు సొంత భాష మాళయాలంలో కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు అప్పుడప్పుడూ ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. పాతికేళ్ళ తర్వాత తెలుగులో కూడా ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాలు చేసాడు మోహన్ లాల్.‘జనతా గ్యారేజ్’ తర్వాత మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘ఫులి మురుగగన్’ సినిమాను తెలుగులో ‘మన్యం పులి’గా తీసుకొచ్చి ఇక్కడా హిట్ కొట్టాడు మోహన్ లాల్. దాంతో వరసగా తన సినిమాలను ఇక్కడ విడుదల చేయడం అలవాటు చేసుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం ఈయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒడియన్’ను, విలన్ సినిమాను ‘పులిజూదం’గా తెలుగులో డబ్ చేసిరిలీజ్ చేసాడు.

తాజాగా మోహన్ లాల్ మలయాళంలో ‘లూసీఫర్’ సినిమాను చేసాడు. తాజాగా మలయాళ వెర్షన్‌ను సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఔట్ అండ్ ఔట్ మాస్ కమ్ పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ విలన్‌గా నటించాడు. మంజు వారియర్ హీరోయిన్‌గా నటించిన ఈసినిమాపై మలయాళ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయనున్నారు. అంతేకాదు తెలుగులో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది.

First published: March 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు