Home /News /movies /

MALAYALA STAR HERO MOHANLAL DAUGHTER VISMAYA STUNS WITH HER MAKEOVER AND REDUCED 22 KG WEIGHT PK

Mohanlal Daughter Vismaya: 22 కేజీలు బరువు తగ్గిన స్టార్ హీరో కూతురు.. షాక్‌లో ఫ్యాన్స్..

విస్మయ మోహన్ లాల్ (Vismaya Mohanlal)

విస్మయ మోహన్ లాల్ (Vismaya Mohanlal)

Mohanlal Daughter Vismaya: బరువు తగ్గడం అనేది ఈ రోజుల్లో పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే చాలా మంది ఇట్టే బరువు తగ్గిపోతున్నారు. అయితే ఎలా తగ్గుతున్నారు అనేది కీలకం. కొందరు లైపో చేయించుకుంటారు.. కానీ అది ఆరోగ్యానికి హానికరం కూడా.

బరువు తగ్గడం అనేది ఈ రోజుల్లో పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే చాలా మంది ఇట్టే బరువు తగ్గిపోతున్నారు. అయితే ఎలా తగ్గుతున్నారు అనేది కీలకం. కొందరు లైపో చేయించుకుంటారు.. కానీ అది ఆరోగ్యానికి హానికరం కూడా. ఒక్కోసారి వికటిస్తే ప్రాణాలు కూడా పోతాయి. ఆర్తి అగర్వాల్ మరణానికి ప్రధాన కారణం లైపో ఫెయిల్ కావడమే. ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని యోగా, వ్యాయామాలు చేసి బరువు తగ్గుతుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో కూతురు ఇదే చేసింది. తాజాగా తన లుక్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఒకప్పుడు నిండుగా, లావుగా ఉండే ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు సన్నగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ. పేరులో ఉన్నట్లుగానే నిజంగానే అందర్నీ మాయ చేసంది ఈమె. ఒకప్పుడు వందల కేజీల బరువు ఉన్న ఈమె ఇప్పుడు 100 కంటే లోపుకు వచ్చేసింది. ఈమె తాజా ఫోటోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు మేం చూసిన విస్మయేనా ఈ విస్మయ అంటూ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఈమె సన్నబడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను విస్మయ తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. కేవలం యోగా, మిగిలిన వ్యాయామాలు సరిగ్గా చేయడం వల్లే 22 కిలోలు బరువు తగ్గింది విస్మయ. తన మేకోవర్‌లో కోచ్ కీలక పాత్ర పోషించాడని చెప్పింది విస్మయ. తన వర్కవుట్ వీడియోలతో పాటు ఫోటోలు కూడా పోస్ట్ చేసింది ఈమె. ఇది చూసిన అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బరువు తగ్గడం కోసం థాయ్‌లాండ్ వెళ్లింది ఈ బ్యూటీ. అక్కడ ఉన్న ప్రతిక్షణం సంతోషంగా గడిపానని.. శిక్షణ బృందం తనను చాలా బాగా చూసుకున్నారని గుర్తు చేసుకుంది విస్మయ.

కొన్నేళ్ల క్రితం నాలుగు మెట్లు ఎక్కితేనే ఊపిరాడక ఇబ్బందిపడేదాన్నని.. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది విస్మయ. తన కోచ్‌ వల్లే సాధ్యమైందని ఆనందంగా చెబుతుంది విస్మయ. ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చింది విస్మయ. ఏదేమైనా కూడా ఒకప్పుడు లావుగా కనిపించిన మాయ ఇప్పుడు మాత్రం నిజంగానే తన లుక్‌తో మాయ చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malayala Cinema, Mohanlal, Telugu Cinema

తదుపరి వార్తలు