Home /News /movies /

MALAYALA MEGASTAR MAMMOOTTYS YATRA MOVIE DUBBING MAKING VISUALS TA

‘యాత్ర’ కోసం నాల్గోసారి ఆ పని చేసిన మమ్ముట్టి

‘యాత్ర’ మమ్ముట్టి

‘యాత్ర’ మమ్ముట్టి

Yatra Mammootty | ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ‘యాత్ర’ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన ఈ సినిమా వాళ్లు తాజాగా వాయిస్ ఆఫ్ యాత్ర పేరుతో మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.

ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఈ రూట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా దారితీసిన పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించారు. మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేసిన  ఈ సినిమాలో దివంగత వైయస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి యాక్ట్ చేసాడు.

ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీటైన ‘యాత్ర’ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన ఈ సినిమా వాళ్లు తాజాగా వాయిస్ ఆఫ్ యాత్ర పేరుతో మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.

తెలుగు భాష రాకపోయిన మమ్ముట్టి ఈ సినిమా కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. గతంలో మమ్ముట్టి తెలుగులో స్ట్రెయిట్‌గా నటించిన ‘స్వాతి కిరణం’, ‘సూర్య పుత్రులు’, ‘రైల్వే కూలి’ వంటి సినిమాలకు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇపుడు ‘యాత్ర’ కోసం మరోసారి ఓన్ వాయిస్ వినిపించనున్నాడు.

ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో జగపతి బాబు, సుహాసిని, రావు రమేస్, అనసూయ, పోసాని కృష్ణ మురళి, సచిన్ ఖేడ్కర్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.  ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో జగన్మోహన్ రెడ్డి కనిపించనున్నట్టు సమాచారం.

రకుల్ ప్రీత్ హాట్ ఫోటోస్


ఇవి కూడా చదవండి 

మహేష్ సినిమాపై సస్పెన్స్ వీడేది అపుడే..

తమిళనాట నెంబర్ గేమ్.. రజనీకాంత్ ను దాటేసిన విజయ్..

పోర్న్ స్టార్‌గా మారిపోయిన ర‌మ్య‌కృష్ణ‌.. అభిమానుల‌కు షాక్..

 
First published:

Tags: Malayala Cinema, Malluwood, Mammootty, Telugu Cinema, Tollywood, YSR

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు