Home /News /movies /

యాత్ర ట్రైలర్ విడుదల..వైయస్‌ఆర్‌గా మమ్ముట్టి అదుర్స్

యాత్ర ట్రైలర్ విడుదల..వైయస్‌ఆర్‌గా మమ్ముట్టి అదుర్స్

‘యాత్ర’లో వైయస్ఆర్ పాత్రలో మమ్ముట్టి

‘యాత్ర’లో వైయస్ఆర్ పాత్రలో మమ్ముట్టి

ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది.  అదే రూట్లో దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెరకెక్కింది. తాజాగా ‘యాత్ర’ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది.  అదే రూట్లో దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెరకెక్కింది.

    ఈ మూవీలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి యాక్ట్ చేసాడు.ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఉన్న మమ్ముట్టి లుక్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    తాజాగా ‘యాత్ర’ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.


    ఈ ట్రైలర్‌లో నా విధేయతను విశ్వసాన్ని బలహీనతగా తీసుకొోవద్దంటూ మమ్ముట్టి చెప్పిన డైలాగ్‌తో స్టార్ట్ అయింది. నాయకుడిగా మనకేం కావాలో తెలుసుకోగలిగాం కానీ..ప్రజలకు ఏమి కావాలో తెలుసుకోలేకపోయాం అంటూ ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

    మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ మూవీని ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైయస్ఆర్ పాత్రలో నటించారు. ఈ మూవీని మూడు భాషల్లో విడుదల కానుంది.
    ‘యాత్ర’లో వైయస్ఆర్‌గా మమ్ముట్టి


    ఈ సందర్భంగా ప్రజలు పడుతున్న కష్టనష్టాలను తెలుసుకోవడం..పేదరికానికి మించిన శిక్ష లేదంటూ డైలాగు చెబుతూనే... పేదల కోసం ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టడం వెనకవున్న ఉద్దేశ్యాన్ని ఈ ట్రైలర్‌లో చూపెట్టారు.

    దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’.  ఈ చిత్రంలో వైయస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించాడు.
    ‘యాత్ర’ వైయస్ఆర్ పాత్రలో మమ్ముట్టి


    అంతేకాదు కాంగ్రెస్  హై కమాండ్ మాట ఇచ్చేముందు ఆలోచించుకోవాలి అంటే..మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను. ఇచ్చాకా ఆలోచించాల్సిన పనేముంది..ముందుకు వెళ్లాల్సిందే. అని మమ్ముట్టి చెప్పిన డైలాగ్ ఆకట్టుకునే విదంగా ఉంది. అంతేకాదు నీవు మారావని నమ్మాను. ఈసారి నా ఓటు నీకే అంటూ ఒక క్యారెక్టర్‌తో చెప్పించడం ఈ సినిమాకే హైలెట్ అనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వల్లే వైయస్ఆర్ ముఖ్యమంత్రి కాలేదు. ఆయన వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ సినిమాలో ట్రైలర్‌లో చూపించారు.

    yatra
    యాత్ర ట్విట్టర్ ఫోటో


    ట్రైలర్ చివర్లో   ఒక పేషెంట్..వైయస్ఆర్ పాత్రకు ఏదో చెప్పాలనుకుంటాడు. కానీ డాక్టర్ మాత్రం అతనేం మాట్లాడలేడు అంటాడు. కానీ అతను మాట్లాడేది  నాకు వినపడుతోంది అంటూ మమ్ముట్టి చెప్పిన ఫినిషింగ్ డైలాగ్ బాగుంది. మొత్తానికి ‘యాత్ర’ సినిమాను ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించనట్టు కనబడుతోంది.  అంతేకాదు మలయాళ నటుడైన తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ‘ఆనందో బ్రహ్మా’ ఫేమ్ మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన ‘యాత్ర’  సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు. మొత్తానికి ట్రైలర్‌తో  ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

    కియరా అద్వానీ హాట్ ఫోటోస్



    ఇవి కూడా చదవండి 

    ‘పీఎం నరేంద్ర మోదీ’ ఫస్ట్ లుక్ రిలీజ్..నమో పాత్రలో ఒదిగిపోయిన వివేక్ ఓబరాయ్

    మన్మోహన్ సింగ్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టులో తొలిగిన అడ్డంకులు

    ‘ఎన్టీఆర్’ కోసం జోలె పట్టిన బాలకృష్ణ..

     
    First published:

    Tags: Jagapati Babu, Kollywood, Malayala Cinema, Malluwood, Mammootty, Tamil Cinema, Telugu Cinema, Tollywood, YSR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు