అద్భుతమైన కెరీర్.. దర్శకుడిగా మంచి గుర్తింపు.. అంతలోనే ఊహించని కుదుపు.. రేప్ కేసులో ఓ యువ దర్శకుడు అరెస్ట్ అయి పోలీసు స్టేషన్‌లో ఉన్నాడిప్పుడు. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఇలాంటి కేసులు కామన్ అయిపోతున్నాయి. తాజాగా మలయాళ ఇండస్ట్రీలో ఓ దర్శకుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా.. అదుపులోకి తీసుకునే వరకు వచ్చింది వ్యవహారం. మలయాళంలో పడవెట్టు, ఇమ లాంటి సినిమాలు చేసిన లిజు కృష్ణపై రేప్ కేసు నమోదైంది. దాంతో ఫిర్యాదు అందుకున్న కక్కనాడ్ ఇన్ఫోపార్క్ పోలీసులు కన్నూరు నుంచి లిజు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం ఆరోపణలపై మార్చి 6న కేరళలోని కన్నూర్ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన అంశాల్లో అతనికి సహకరించిన ఓ యువతి ఫిర్యాదు చేయడంతో.. అతనిపై కాకనాడ్ ఇన్ఫోపార్క్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మంజు వారియర్, అదితి బాలన్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నటుడు సన్నీ వేన్ నిర్మిస్తున్నాడు. పెదవెట్టు సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు లిజు కృష్ణ. ఇంతకుముందు సన్నీ వేన్, లిజు కలిసి మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్ అనే నాటకానికి పనిచేశారు. ఈ నాటకానికి సన్నీ దర్శకత్వం వహించగా.. లిజు నిర్మించారు. ఇప్పుడు ఈయన నిర్మాణంలో ఆయన సినిమా తెరకెక్కిస్తున్నాడు. కస్టడీలోకి తీసుకున్న సమయంలో లిజు స్వస్థలమైన కన్నూర్‌లో పడవెట్టు షూటింగ్ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి.
ఈ ఏడాదే పెదవెట్టు విడుదల చేయాలని భావిస్తున్నారు. కొచ్చిలో టాటూ ఆర్టిస్ట్‌పై వరుస లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే ఈ కేసు వచ్చింది. అతనిపై పలు లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి రావడంతో ఈ కేసులో నిందితుడు సుజీష్ పీఎస్‌ను మార్చ్ 6 రాత్రి అరెస్టు చేశారు. కొద్దిరోజుల క్రితం సోషల్‌మీడియాలో విషయాలు వెల్లడి కావడంతో పరారీలో ఉన్న సుజీష్‌పై ఆరుగురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. 18 ఏళ్ల యువతి తన పార్లర్‌లో టాటూ వేయించుకునే సమయంలో అతడిపై లైంగిక వేధింపులకు గురి కావడం గురించి మాట్లాడింది. అంతలోనే మలయాళ దర్శకుడు లిజు కృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Malayala Cinema