అల్లు అర్జున్‌తో ఇలా అవకాశం రావడం ఊహించలేదు: ప్రియా ప్రకాశ్ వారియర్

నటి ప్రియా ప్రకాశ్ వారియర్ పరిచయం అక్కరలేని..మలయాళ నటి..ఒక కన్నుగీటుతో దేశంలో కుర్రకారును మొత్తం తన వైపుకు తిప్పుకుంది. ఆమె నటించిన ‘ఒరు ఆదార్ ల‌వ్‌’ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.

news18-telugu
Updated: January 25, 2019, 5:34 AM IST
అల్లు అర్జున్‌తో ఇలా అవకాశం రావడం ఊహించలేదు: ప్రియా ప్రకాశ్ వారియర్
ప్రియా వారియర్ అల్లు అర్జున్
news18-telugu
Updated: January 25, 2019, 5:34 AM IST
నటి ప్రియా ప్రకాశ్ వారియర్ పరిచయం అక్కరలేని..మలయాళ నటి..ఒక కన్నుగీటుతో దేశంలో కుర్రకారును మొత్తం తన వైపుకు తిప్పుకుంది. ఆమె నటించిన ‘ఒరు ఆదార్ ల‌వ్‌’ చిత్రం తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌పై ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానిక సంబందించిన ఆడియో విడుదల కార్యక్రమం జనవరి 23న హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చి ఆడియో సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ మాట్లాడుతూ.. ‘‘హీరో అల్లు అర్జున్‌ అంటే... నాకు చాలా ఇష్టం. ఆయ‌న‌తో క‌లిసి స్టేజ్‌పై ఇలా..పక్కనే నిల‌బ‌డి తన సినిమా గురించే మాట్లాడే అవ‌కాశం వ‌స్తుంద‌ని అస్సలు ఊహించలేదు. ఆయ‌న్ను క‌లుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది‌ అని పేర్కోంది. ఇంకా ప్రియా మాట్లాడుతూ.. ‘ఒరు ఆదార్ ల‌వ్‌’ టీమ్ తరపున అందరికీ అడ్వాన్స్‌డ్ హ్యపీ వేలంటైన్స్‌డే అని చెప్పింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు చూడాలని కోరింది.

VIDEO: అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ... ఐదుగురిని చంపిన సైకో...First published: January 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...