Home /News /movies /

MALAYALA ACTOR PRABEESH CHAKKALAKKAL DIES AT SHOOTING SPOT PK

ఇండస్ట్రీలో విషాదం.. షూటింగ్ స్పాట్‌లోనే చనిపోయిన హీరో..

మలయాళం నటుడు ప్రబీష్ (malayalam actor prabeesh)

మలయాళం నటుడు ప్రబీష్ (malayalam actor prabeesh)

Prabeesh Chakkalakkal: 2020 ఏమైందో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో చాలా విషాదాలు జరుగుతున్నాయి. ఒకదాన్ని మరిచిపోక ముందే మరోటి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.

2020 ఏమైందో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో చాలా విషాదాలు జరుగుతున్నాయి. ఒకదాన్ని మరిచిపోక ముందే మరోటి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా మలయాళ సినిమా పరిశ్రమలో విషాదం జరిగింది. షూటింగ్‌లో ఉండగానే ఈయన కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రబీష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
మలయాళం నటుడు ప్రబీష్ (malayalam actor prabeesh)
మలయాళం నటుడు ప్రబీష్ (malayalam actor prabeesh)

సినిమా యూనిట్ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవరూ వాహనాన్ని ఆపకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆయన కారును వెతికి వెతికి తీసుకొచ్చే సరికి ప్రబీష్ చనిపోయాడు. 44 సంవత్సరాల ప్రబీష్ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మలయాళం నటుడు ప్రబీష్ (malayalam actor prabeesh)
మలయాళం నటుడు ప్రబీష్ (malayalam actor prabeesh)

కేరళలోని కొచ్చిన్‌లో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సినిమా సెట్‌లో విషాదం అలుముకుంది. మొత్తానికి చిన్న వయసులోనే చనిపోవడంతో ప్రబీష్ సన్నిహితులతో పాటు ఇండస్ట్రీ సభ్యులు కూడా విషాదంలో మునిగిపోయారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Malayala Cinema

తదుపరి వార్తలు