హోమ్ /వార్తలు /సినిమా /

Fahadh Faasil: షూటింగ్‌లో బిల్డింగ్ నుంచి కింద పడ్డ స్టార్ నటుడు పహాద్.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

Fahadh Faasil: షూటింగ్‌లో బిల్డింగ్ నుంచి కింద పడ్డ స్టార్ నటుడు పహాద్.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

Fahadh Faasil: మెన్న‌టికి మొన్న‌ షూటింగ్‌లో పాల్గొన్న క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. చిత్రీక‌ర‌ణలో భాగంగా పెట్రోల్ బాంబ్‌లు వేసి వ‌స్తోన్న స‌మ‌యంలో అనుకోకుండా అవి పేల‌డంతో రిష‌బ్‌కి గాయాల‌య్యాయి. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఇంకా చదవండి ...

    Fahadh Faasil: మెన్న‌టికి మొన్న‌ షూటింగ్‌లో పాల్గొన్న క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. చిత్రీక‌ర‌ణలో భాగంగా పెట్రోల్ బాంబ్‌లు వేసి వ‌స్తోన్న స‌మ‌యంలో అనుకోకుండా అవి పేల‌డంతో రిష‌బ్‌కి గాయాల‌య్యాయి. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ సంఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే మ‌రో స్టార్ న‌టుడు షూటింగ్‌లో ప్ర‌మాదానికి గుర‌య్యాడు. షూటింగ్‌లో పాల్గొన్న మ‌ల‌యాళ న‌టుడు ప‌హాద్ ఫాజిల్ బిల్డింగ్ నుంచి కింద‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌కు చిన్న చిన్న గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది.

    వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌హాద్ ప్ర‌స్తుతం మ‌ల‌య‌న్ కుంజ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా వేసిన ఓ ఇంటి సెట్‌ని వేశారు. అక్క‌డి నుంచి దూకే స‌మ‌యంలో అనుకోకుండా కింద ప‌డ్డాడు ప‌హాద్. వెంట‌నే చిత్ర యూనిట్ అత‌డిని కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం మంగ‌ళ‌వారం జ‌ర‌గ్గా.. ఆయ‌న ముక్కుకు గాయాలు అయ్యాయ‌ని, ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలుస్తోంది.

    కాగా బెంగ‌ళూరు డేస్, ట్రాన్స్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ప‌హాద్. స‌హ న‌టి న‌జ్రియాను ఈ హీరో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇన్ని రోజులు త‌మిళ్, మ‌ల‌యాళం భాష‌ల్లో న‌టించిన నజ్రియా ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. నాని హీరోగా న‌టిస్తోన్న అంటే సుంద‌రానికిలో న‌జ్రియా న‌టిస్తోంది.

    First published:

    ఉత్తమ కథలు