ఇస్మార్ట్ శంకర్‌‌ను నమ్ముకున్న రవితేజ భామ... ఆశలన్నీ ఆయనపైనే..

Malavika Sharma: రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మాళవిక శర్మ నటించింది.

news18-telugu
Updated: March 18, 2020, 7:03 AM IST
ఇస్మార్ట్ శంకర్‌‌ను నమ్ముకున్న రవితేజ భామ... ఆశలన్నీ ఆయనపైనే..
మాళవిక శర్మ Photo : Twitter
  • Share this:
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మాళవిక శర్మ నటించింది. ఈ సినిమాలో మాళవిక తన అందాలతో అదరగొట్టినా..ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో.. ఈ భామ ఎవరికీ తెలవకుండా పోయింది. అయితే అమ్మడు అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ భామ రామ్ 'రెడ్‌'లో నటిస్తోంది. ఈ సందర్బంగా మాళవిక మాట్లాడుతూ.. 'కొన్ని సినిమాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. నా కెరీర్‌ విషయంలో అలాంటి అరుదైన సినిమా 'రెడ్‌'. ఈ సినిమాతో తెలుగులో నాకు మంచి గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను' అని అంటోంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత తెలుగులో నాకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం' అని చెప్పింది. ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ రెడ్ చిత్రాన్ని చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన 'నువ్వే.. నువ్వే' పాట విశేష శ్రోతకాదరణ పొంది సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

రెడ్ సినిమా ఏప్రిల్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా తమిళ తడమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన మాళవికతో పాటు నివేథా పేతురాజ్, అమృత అయ్యర్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: March 18, 2020, 7:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading