హోమ్ /వార్తలు /సినిమా /

Malaika Arora: ఆ నిజాన్ని నమ్మలేకపోతున్న.. ప్రమాదంపై స్పందించిన మలైక అరోరా

Malaika Arora: ఆ నిజాన్ని నమ్మలేకపోతున్న.. ప్రమాదంపై స్పందించిన మలైక అరోరా

మలైకా అరోరా ఫిట్నెస్ సీక్రెట్స్

మలైకా అరోరా ఫిట్నెస్ సీక్రెట్స్

పూణె వెళ్లిన మలైక తిరిగి ముంబైకు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆమెతో పాటు ఆమె బాడీ గార్డ్, డ్రైవర్ కూడా ఉన్నారు.

బాలీవుడ్ ప్రముఖ నటి మైలక అరోరా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో పాల్గొనేందుకు పుణెకు వెళ్లిన ఆమె.. ముంబయి తిరుగు ప్రయాణం అవుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ లో నటి మలైకా కంటికి తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆమెను నవీ ముంబయిలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ముంబై - పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో మలైక గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఆమె ప్రమాద ఘటనపై స్పందించింది. ఇటీవలే ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. దాంతో బాలీవుడ్ సెలబ్రిటీస్, ఆమె స్నేహితులు, సన్నిహితులు మలైకను పరామర్శించడానికి క్యూ కట్టారు. యాక్సిడెంట్ అయిన తర్వాత మొదటి సారి ఆ సంఘటనపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించింది మలైకా అరోరా. తనకు యాక్సిడెంట్ అయిన సంఘటన ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించడం లేదంది ఈ హాట్ బ్యూటీ. అదేదో సినిమాలో జరిగినట్టుగా అయిపోయిందంది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో తనతో పాటు ఉన్నవారు, తన చుట్టుపక్కల వారు ఎంతో సాయం చేశారని చెప్పుకొచ్చింది.

ప్రమాదంలో గాయపడిన వెంటనే తనను హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని చెప్పింది. ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది సంపూర్ణ సహకారంతో తాను త్వరగా కోలుకోగలిగానని మలైక పేర్కొంది. స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, సోషల్ మీడియా ద్వారా అభిమానులు చూపించిన ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ ఎమోషనల్ అయ్యింది మలైకా. 'తానో పోరాట యోధురాలినని, అతి త్వరలోనే తిరిగి జనం మధ్యకు వస్తానని తెలిపింది.

బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ కొన్ని చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ చేసిన మలైకా ప్రస్తుతం హిందీలో పలు రియాలిటీ షోస్ కు జడ్జీగా వ్యవహరిస్తోంది. సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ను పెళ్లి చేసుకొని, తర్వాత విడాకులు ఇచ్చేసింది మలైక అరోరా. ప్రస్తుతం బాలీవుడ్‌ యువ నటుడు అర్జున్‌ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇండియాస్‌ బెస్ట్‌ డ్యాన్సర్‌, జలక్‌ దిఖ్‌లాజాలాంటి రియాల్టీ షోలలో ఆమె జడ్జిగా వ్యవహరించింది.

First published:

Tags: Arjun Kapoor, Bollywood news, Malaika Arora

ఉత్తమ కథలు