Malaika Arora: కరోనాను జయించిన గబ్బర్ సింగ్ భామ మలైకా అరోరా..

Malaika Arora Corona Virus Covid - 19 | బాలీవుడ్ నటి మలైకా అరోరా కరోనాను జయించింది. కొన్ని రోజులు క్రితం మలైకా అరోరా తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే కదా.

news18-telugu
Updated: September 20, 2020, 9:18 PM IST
Malaika Arora: కరోనాను జయించిన గబ్బర్ సింగ్ భామ మలైకా అరోరా..
కరోనా నుంచి కోలుకున్న మలైకా అరోరా (Instagram/Photo)
  • Share this:
Malaika Arora : బాలీవుడ్ నటి మలైకా అరోరా కరోనాను జయించింది. కొన్ని రోజులు క్రితం మలైకా అరోరా తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. మలైకాతో పాటు ఈయన బాయ్ ఫ్రెండ్ బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌కు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే కదా. తాజాగా మలైకా అరోరా తాను కరోనాతో పోరాడిన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ఇక కరోనాతో తాను పెద్దగా ప్రాబ్లెమ్ ఫేస్ చేయలేదంటూ చెప్పుకొచ్చింది. కానీ కాస్తంత అసౌర్యంగా ఫీలయ్యాను అని చెప్పుకొచ్చింది. వైరస్‌ను జయించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకోవడంలో తనకు సాయపడిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.




కరోనా సోకడంతో మలైకా అరోరా డాక్టర్ల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉంది. ఈ సందర్భంగా తన కుమారుడు అర్హాన్, తన ఇంట్లో ఉండే పెంపుడు కుక్కను ఎంతో మిస్ అయినట్టు చెప్పుకొచ్చింది. ఇక కరోనా నుంచి ఇప్పటికే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, దర్శకుడు రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు, నిర్మాత డీవీవీ దానయ్య, బండ్ల గణేష్ వంటి ప్రముఖులు కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ఎస్పీ బాలు కరోనాతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు కరోనాకు చికిత్స అందిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 9:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading