MALAIKA ARORA HOSPITALISED AFTER SHE GETS INJURED IN A CAR ACCIDENT MKS
Malaika Arora: షాకింగ్.. కారు ప్రమాదంలో మలైకా అరోరాకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు..
ప్రమాదంలో మలైకకు గాయాలు
బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా ఆస్పత్రిపాలయ్యారు. ఆమె ప్రయాణిస్తోన్న కారు ముంబై శివారులో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మలైకకు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు.
బాలీవుడ్ నటి, మోడల్ మలైకా అరోరా ఆస్పత్రిపాలయ్యారు. ఆమె ప్రయాణిస్తోన్న కారు ముంబై శివారులో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మలైకకు గాయాలు కాగా, ఆమెను ఆస్పత్రికి తరించారు. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో మూడు వాహనాల మధ్య మలైకా కారు నలిగిపోయిన ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. ప్రమాదంపై ఖొపోలీ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పిన వివరాలివి..
నటి, మోడల్ మలైకా అరోరా శనివారం మధ్యాహ్నం ఓ ఫ్యాషన్ ఈవెంట్ ముగించుకుని ఇంటికి బయలుదేరారు. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఆమె ప్రయాణిస్తుండగా, 38వకిమీ పాయింట్ వద్ద ప్రమాదం జరిగింది. హైవేపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని, అన్నీ దెబ్బతిన్నాయి. ప్రమాదం తర్వాత మిగతా వాహనాలు వెళ్లిపోగా, గాయపడ్డ మలైకను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
మలైకకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారని, కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నామనీ పోలీసులు చెప్పారు.
బాలీవుడ్ లో పాపులర్ ఫిగరైన మలైకా అరోరా దిల్ సే సినిమాలో చయ్యా చయ్యా పాటతో ఓవర్ నైట్ స్టారైపోయారు. మాహి వే, మున్నీ బద్నం లాంటి హిట్ ఐటమ్ నంబర్లతో క్రేజ్ పెంచుకున్నారు. పలు టీవీ షోలకు జడ్జిగా, హోస్టుగానూ వ్యవహరించారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లాడి, దశాబ్దాల కాపురం తర్వాత విడిపోయిన మలైకా అరోరా(48) తనకంటే 12 ఏళ్లు చిన్నోడైన అర్జున్ కపూర్ తో కొంత కాలంగా డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచారు. మలైక గాయపడి చికిత్స పొందుతోన్న ఆస్పత్రికి ఆమె కుటుంబీకులు, బంధువులు వెళ్లారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.