బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ మధ్య రిలేషన్ షిప్ మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న విషక్ష్ం తెలిసిందే. అయితే వీరి పెళ్లి ఎప్పుడు అని బాలీవుడ్లో అంతా జోరుగా చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఈ బాలీవుడ్ కపుల్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రేమలో మునిగి తేలిన జంట నెక్స్ట్ ఏంటి? అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
తాజాగా బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ అర్జున్ కపూర్‌తో రిలేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. 'మేమిద్దరం కలిసి నడవాల్సిన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఇది నాకు చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎటువైపు అడుగులు వేయాలన్న పరిస్థితి దగ్గర మేము నిలబడి ఉన్నాం అంటూ మలైక చెప్పుకొచ్చింది. ‘మేము చాలా విషయాలను చర్చించాము. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కలిసి జీవితాన్ని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాం. మొదట్లో దీని గురించి జోక్స్ చేసుకునేవాళ్లం కానీ ఇప్పుడు సీరియస్‌గా తీసుకున్నాం. ఒక బంధంలో ఉన్నప్పుడు చాలా పాజిటివ్‌గా, సురక్షితంగా ఉన్నామనిపించాలి. అర్జున్ నాకు ఆ రెండింటినీ అందించాడు. ఎందుకంటే అతడు నావాడు' అని చెప్పుకొచ్చింది.
మలైకా చేసిన కామెంట్స్‌తో త్వరలోనే అర్జున్‌తో ఏడడుగులు నడవనున్నట్లు ఓ హింట్ ఇచ్చేసిందంటున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు డేటింగ్ చేసిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటారనే.. వార్తలు రావడంతో అభిమానులు అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సల్మాన్ సోదరుడు అర్జాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న మలైకా...ఆ తర్వాత అతడికి విడాకులు ఇచ్చేసింది. 1998లో అర్భాజ్ ఖాన్ వివాహం చేసుకున్నాక కూడా ఎన్నో ఐటెం సాంగ్స్ లో చిందులేసింది. వీరిద్దరూ 2017 లో విడిపోయారు. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.
అయినప్పటికీ వీరు విడిపోవాలని ఎలా డిసైడ్ అయ్యారు అనే వాటి పై గతంలో కరీనా కపూర్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చిన మలైకా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ…”నేను విడాకులు తీసుకోవాలి అని డిసైడ్ అయిన టైములో చాలా మంది నన్ను తిట్టిపోశారు. ఇది సరైన నిర్ణయం కాదు మాకు సంబంధం లేదు అంటూ నన్ను నిందించారు. కానీ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే జీవన విధానాన్ని కష్టంగా మార్చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మలైకా..అర్జున్ కపూర్ తో అలాగే అర్భాజ్ ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో రిలేషన్ షిప్ లో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arjun Kapoor, Bollywood, Malaika Arora