టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో చాన్స్ కొట్టేసిన ప్రియా వారియర్...

Priya Prakash Varrier | యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా విడుదల కానే లేదు. అపుడే ప్రియా ప్రకాష్ వారియర్ దూకుడు మాములుగా లేదు. తాజాగా ఈ భామ తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 4, 2019, 8:33 PM IST
టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో చాన్స్ కొట్టేసిన ప్రియా వారియర్...
ప్రియా ప్రకాష్ వారియర్
  • Share this:
యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా విడుదల కానే లేదు. అపుడే ప్రియా ప్రకాష్ వారియర్ దూకుడు మాములుగా లేదు. ఈ భామ ఫస్ట్ సినిమా ‘ఒరు అదారు లవ్’ సినిమా విడుదల కాలేదు. అపుడే బాలీవుడ్‌లో ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా చేసే చాన్స్ కొట్టేసింది. అంతేకాదు ఈ సినిమా టీజర్ విడుదల కావడమే ఆలస్యం ఈ సినిమాపై పెద్ద రచ్చే నడుస్తోంది.

ఇక ‘ఒరు అదారు లవ్’ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో ప్రియా వారియర్ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

అందులో ముందుగా  త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో ప్రియా వారియర్‌ను ఒక హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. రీసెంట్‌గా అల్లు అర్జున్ ‘లవర్స్ డే’ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లింది అందుకే అని చెబుతున్నారు. పైగా తెలుగు హీరోల్లో అల్లు అర్జున్‌కు కేరళలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ రకంగా ప్రియా వారియర్‌కు కథానాయికగా తీసుకోవడంతో కేరళలో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో మరో కథానాయికగా రష్మిక మందనను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

ఇంకోవైపు ప్రియా వారియర్..నాని, విక్రమ్ కుమార్ సినిమాలో ఒక కథానాయకగా యాక్ట్ చేయడానికి ఓకె చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో మొత్తంగా ఐదుగురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. అందులో ఒక కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్, నాని వంటి క్రేజీ హీరోల సినిమాలతో తెలుగులో కూడా ప్రియా వారియర్‌ తన దూకుడు చూపించే అవకాశమైతే ఉంది.
ఇవి కూడా చదవండి

పడక గదికి పిలిచే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటున్న కాజల్..చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను వేధిస్తున్న సమస్య..

వేలం పాటలో రికార్డు సృష్టించిన ‘యాత్ర’ ఫస్ట్ టిక్కెట్..
First published: February 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు