తెలుగులో ప్రియా వారియర్ క్రేజీ ప్రాజెక్ట్స్ ...ఇంతకీ ఎవరా హీరోలు..

Priya Prakash Varrier | యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా విడుదల కానే లేదు. అపుడే ప్రియా ప్రకాష్ వారియర్ దూకుడు మాములుగా లేదు. తాజాగా ఈ భామ తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిందట.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 30, 2019, 7:13 PM IST
తెలుగులో ప్రియా వారియర్ క్రేజీ ప్రాజెక్ట్స్ ...ఇంతకీ ఎవరా హీరోలు..
ప్రియా ప్రకాష్ వారియర్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 30, 2019, 7:13 PM IST

యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా విడుదల కానే లేదు. అపుడే ప్రియా ప్రకాష్ వారియర్ దూకుడు మాములుగా లేదు. ఈ భామ ఫస్ట్ సినిమా ‘ఒరు అదారు లవ్’ సినిమా విడుదల కాలేదు. అపుడే బాలీవుడ్‌లో ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా చేసే చాన్స్ కొట్టేసింది. అంతేకాదు ఈ సినిమా టీజర్ విడుదల కావడమే ఆలస్యం ఈ సినిమాపై పెద్ద రచ్చే నడుస్తోంది.


ఇక ‘ఒరు అదారు లవ్’ సినిమా తెలుగులో ‘లవర్స్ డే’ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో ప్రియా వారియర్ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పిందట.


అందులో ఒకటి త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో ప్రియా వారియర్‌ను ఒక హీరోయిన్‌గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. రీసెంట్‌గా అల్లు అర్జున్ ‘లవర్స్ డే’ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లింది అందుకే అని చెబుతున్నారు. పైగా తెలుగు హీరోల్లో అల్లు అర్జున్‌కు కేరళలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ రకంగా ప్రియా వారియర్‌కు కథానాయికగా తీసుకోవడంతో కేరళలో ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో మరో కథానాయికగా రష్మిక మందనను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.ఇంకోవైపు ప్రియా వారియర్..నాని, విక్రమ్ కుమార్ సినిమాలో ఒక కథానాయకగా యాక్ట్ చేయడానికి ఓకె చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో మొత్తంగా ఐదుగురు హీరోయిన్లు యాక్ట్  చేస్తున్నారు. అందులో ఒక కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్, నాని వంటి క్రేజీ హీరోల సినిమాలతో తెలుగులో కూడా ప్రియా వారియర్‌ తన దూకుడు చూపించే అవకాశమైతే ఉంది.


డబూ రత్నానీ క్యాలెండర్ ఫోటోషూట్ 2019..

ఇవి కూడా చదవండి 
Loading...
శారీతో పడేసిందిగా... సీక్రెట్ బయటపెట్టిన సోనమ్ కపూర్

మహేష్ కథతో రవితేజ కొత్త సినిమా...

బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవ‌రు.. జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..?
First published: January 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...