HOME »NEWS »MOVIE »makkal selvan vijay sethupathi apologies for cutting cake with a big knife and released a letter pk

Vijay Sethupathi: బర్త్ డే కేక్ కట్ చేసాడు.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..

Vijay Sethupathi: బర్త్ డే కేక్ కట్ చేసాడు.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
విజయ్ సేతుపతి (Vijay Sethupathi)

Vijay Sethupathi: అదేంటి.. బర్త్ డే కేక్ కట్ చేస్తే కూడా కాంట్రవర్సీ అవుతుందా.. అందుకు కూడా ఎవరైనా సారీ చెప్తారా అనుకుంటున్నారా..? ఈ రోజుల్లో వివాదం అనేది కాఫీ తాగినంత ఈజీగా వచ్చేస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా అడ్డంగా..

  • Share this:
అదేంటి.. బర్త్ డే కేక్ కట్ చేస్తే కూడా కాంట్రవర్సీ అవుతుందా.. అందుకు కూడా ఎవరైనా సారీ చెప్తారా అనుకుంటున్నారా..? ఈ రోజుల్లో వివాదం అనేది కాఫీ తాగినంత ఈజీగా వచ్చేస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా అడ్డంగా బుక్ అయిపోవడం ఖాయం. మరీ ముఖ్యంగా స్టార్స్ అయితే అంతా ఓ కన్నేసి ఉంచుతారు. ఎప్పుడు దొరుకుతారా అని చూస్తుంటారు కూడా. ఏ చిన్న తప్పు చేసినట్లు దొరికినా కూడా ఇక ఫుట్ బాల్ ఆడుకోవడమే. ఇప్పుడు కూడా విజయ్‌సేతుపతి అలాగే దొరికేసాడు. పైగా పాపం ఈయన పుట్టిన రోజు నాడే వివాదంలో ఇరుక్కున్నాడు. అంత తప్పు ఏం చేసాడబ్బా అనుకోవచ్చు.. ఆయన కేక్ కట్ చేసినందుకే కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. అదేంటి అనుకోవచ్చు.. జనవరి 16న ఈయన బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేయించారు దర్శక నిర్మాతలు. ఈయన కేక్ కట్ చేసిన విధానమే ఈయన్ని కాంట్రవర్సీలోకి లాగేసింది. పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా కేక్‌ కట్‌ చేయడానికి ప్రయత్నించి విమర్శల పాలయ్యాడు విజయ్ సేతుపతి. గతంలో కొందరు సంఘవిద్రోహశక్తులు ఇలాగే చేస్తే వాళ్లను పోలీసులు అరెస్టు కూడా చేశారు.. కానీ విజయ్ సేతుపతి లాంటి ప్రముఖుల విషయంలో ఆ న్యాయం వర్తించదా.. అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. దాంతో ఈయన కూడా హర్ట్ అయ్యాడు. వెంటనే సారీ చెప్పేసాడు. ఇంతకీ విజయ్ సేతుపతి చేసిన తప్పేంటంటే పెద్ద కత్తితో ఆయన కేక్ కట్ చేయడమే. అలా చేసినందుకు కొందరి మనోభావాలు దెబ్బ తిన్నాయి. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన ఓ లేఖ రాసాడు.
vijay sethupathi,vijay sethupathi twitter,vijay sethupathi movies,vijay sethupathi birthday,makkal selvan vijay sethupathi birthday,vijay sethupathi birthday controversy,vijay sethupathi news,vijay sethupathi sorry to fans,telugu cinema,విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి క్షమాపణలు,విజయ్ సేతుపతి పుట్టిన రోజు కేక్ కత్తి
విజయ్ సేతుపతి (Vijay Sethupathi)

ప్రస్తుతం పొన్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఆ సినిమాలో ఖడ్గం ప్రధాన పాత్ర పోషిస్తుందని.. అందుకే చిత్రబృందం తనతో కత్తితో కేక్ చేయించిందని చెప్పుకొచ్చాడు. అది వివాదం అవుతుందని నిజంగా తాను ఊహించలేదని చెప్పాడు విజయ్. ఎవరైనా మనసులు నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరాడు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు విజయ్.



ఈ మధ్యే 'మాస్టర్' సినిమాతో వచ్చి భవాని పాత్రలో భయపెట్టాడు విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాతో త్వరలోనే రాబోతున్నాడు. మరోవైపు హిందీలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ ఛడ్డాలోనూ నటిస్తున్నాడు. ఏదేమైనా కూడా పుట్టిన రోజు నాడే వివాదంలో ఇరుక్కోవడంతో సేతుపతి అభిమానులు ఫీల్ అవుతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 16, 2021, 18:01 IST