ఆశ్చర్యం... వింత... దీపికా పదుకొణె టాటూ ఏమైంది?

Deepika Padukone : జనరల్‌గా నటీనటులు టాటూలను తొలగించుకోరు. బ్రేకప్‌ల తర్వాత కూడా వాటిని అలాగే ఉండనిస్తారు. మరి దీపికా పదుకొణె టాటూ ఏమైంది? తీయించేసుకుందా? మేకప్‌తో కవర్ చేసేసిందా?

news18-telugu
Updated: December 30, 2019, 10:23 AM IST
ఆశ్చర్యం... వింత... దీపికా పదుకొణె టాటూ ఏమైంది?
దీపికా పదుకొణె (credit - Viral Bhayani)
  • Share this:
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రస్తుతం ఛపాక్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈమధ్య ముంబై ఫిల్మ్‌సిటీలో కలర్‌ఫుల్ సిక్స్ యార్డ్స్ ఆఫ్ గ్రేస్‌లో తళుక్కుమంది. బ్యాక్‌లెస్ బ్లౌజ్‌తో కలర్ ఫుల్ శారీలో రెయిన్‌బో లా కనిపించింది. హెయిర్‌ని పైకి సెట్ చేసి... పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్‌తో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. యాజ్ యూజువల్‌గా ఈ బ్యూటీని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. మిగతా హీరోయిన్లకూ దీపికాకూ ఓ ప్రత్యేకత ఉంది. దీపికాకు ఫ్యాషన్‌పై ఎక్కువ గ్రిప్ ఉంది. ఏ డ్రెస్సైనా ఎలా వేసుకుంటే... ఎట్రాక్టివ్‌గా ఉంటుందో ఈ భామకు బాగా తెలుసు.

దీపికా పదుకొణె (credit - Viral Bhayani)


దీపికా స్టూడియోవైపు వెళ్తుండగా... ఆమెను వెనక నుంచీ తీసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన టీమ్‌తో ఆమె ముందుకు వెళ్తుంటే ఈ ఫొటో క్లిక్కైంది. బ్యాక్‌లెస్ బ్లౌజ్ వేసుకున్నందువల్ల ఆమె వీపు భాగం ఆ ఫొటోలో సంపూర్ణంగా కనిపిస్తోంది. చిత్రమేంటంటే... ఆమె మెడపై ఎప్పుడూ కనిపించే RK (రణబీర్ కపూర్-ఎక్స్ బాయ్ ఫ్రెండ్) టాటూ ఇప్పుడు కనిపించలేదు.

దీపికా పదుకొణె (credit - Viral Bhayani)
ఆ టాటూ ఏమైంది? దాన్ని ఎందుకు తొలగించుకుంది? తొలగించుకుందా లేక మేకప్‌తో కవర్ చేసేసిందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. దీనిపై ఆమెను ప్రశ్నించేలోపే... దీపికా స్టూడియోలోకి వెళ్లిపోయింది. టాటూను లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా తొలగించుకొని ఉండొచ్చని అంటున్నారు. నయనతార లాంటి చాలా మంది ఇలాగే రకరకాల టాటూలు వేయించుకొని... తర్వాత బ్రేకప్ అయినా... వాటిని అలాగే కొనసాగిస్తున్నారు. దీపికా విషయంలో అలాగే జరుగుతోందా లేక టాటూను తొలగించేసుకుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

దీపికా పదుకొణె (credit - Viral Bhayani)


యాసిడ్ బాధితురాలి కథతో వస్తున్న ఛపాక్ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజై దుమ్మురేపింది. ఇందులో యాసిడ్ బాధితురాలిగా దీపికా జీవించేసింది. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతోంది.
First published: December 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు