తమిళ సర్కార్ దెబ్బకి దిగొచ్చిన విజయ్ ‘సర్కార్’... ఆ సీన్స్ కట్!

‘అభ్యంతరకర సన్నివేశాలు’ డిలీట్... ‘అమ్మ’ పథకాల పేర్లు మ్యూట్ చేసేందుకు అంగీకరించిన సన్ పిక్చర్స్, తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్... రేపు మధ్యాహ్నం నుంచి రీఎడిటెడ్ వెర్షన్ ప్రదర్శన

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 10:18 PM IST
తమిళ సర్కార్ దెబ్బకి దిగొచ్చిన విజయ్ ‘సర్కార్’... ఆ సీన్స్ కట్!
థియేటర్ వద్ద అన్నాడీఎంకే నేతల ధర్నా... ‘సర్కార్’ చిత్రంలో విజయ్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 10:18 PM IST
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘సర్కార్’. విభిన్న చిత్రాల దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రూ.47 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసిన ‘సర్కార్’ మూవీ రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న త‌క్ష‌ణ‌మే నిలిపేయాల‌ని మధురైలోని ఓ కాంప్లెక్స్‌ ముందు అన్నాడిఎంకె కార్యకర్తలు ధర్నాకు దిగారు.

‘స‌ర్కార్’ సినిమాలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పథకాలను విమర్శించేలా ఉన్న కొన్ని కాంట్ర‌వ‌ర్సీ సీన్స్.. డైలాగ్స్ వెంట‌నే తొల‌గించాల‌ని.. తొల‌గించే వ‌ర‌కు ఆందోళన చేస్తామని అన్నాడిఎంకె పెద్ద ఎత్తున్న నిరసన చేశారు. విజయ్ కటౌట్‌లను చించివేసి, ఆందోళన చేశారు. అయితే అసలే టాక్ బాగోలేదు... అయినా కలెక్షన్లు వస్తున్నాయి. మధ్యలో అనవసర వివాదాల కారణంగా సినిమాకి నష్టం కలగకూడదని విజయ్ అండ్ కో ఫిక్స్ అయ్యారు. అధికార అన్నాడీఎంకే పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సీన్లను తొలగించేందుకు అంగీకరించారు. ‘సర్కార్’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్, తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు కలిసి ‘అభ్యంతరకర సన్నివేశాలు’ తొలగించేందుకు అంగీకరించినట్టు ప్రకటించారు. పథకాలను ప్రస్తావించే సమయంలో మ్యూట్ వేయనున్నారు.

‘ఈరోజు రాత్రి ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చొన్ని సన్నివేశాలను తొలగిస్తాం సెన్సార్ బోర్డు నుంచి అప్రూవల్ లెటర్ కూడా వచ్చింది. రేపు మధ్యాహ్నం నుంచి థియేటర్లలో రీఎడిట్ చేసిన వెర్షన్ ప్రదర్శన చేస్తాం...’ అని వెస్ట్ జోన్ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్. సుబ్రహ్మణ్యం తెలిపాడు.First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...