Chiranjeevi Lucifer remake: చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్‌పై మేజర్ అప్‌డేట్..

చిరంజీవి (Chiranjeevi)

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆచార్య పూర్తైన వెంటనే మరో నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టాడు మెగాస్టార్. ఈ క్రమంలోనే ఒప్పుకున్న సినిమాలను వేగంగా పూర్తి చేయడానికి తనవంతు ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు..

  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆచార్య పూర్తైన వెంటనే మరో నాలుగు సినిమాలు లైన్‌లో పెట్టాడు మెగాస్టార్. ఈ క్రమంలోనే ఒప్పుకున్న సినిమాలను వేగంగా పూర్తి చేయడానికి తనవంతు ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. మన హీరోలకు కథలు రాయడం ఈజీగానే ఉన్నా.. వాళ్లకు హీరోయిన్లను ఎంపిక చేయడం మాత్రం చాలా కష్టంగా మారిపోతుంది. ముఖ్యంగా చిరంజీవి లాంటి 60 ప్లస్ హీరోలకు సరైన జోడీ తీసుకురావడం కోసం మేకర్స్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చిరు ప్రస్తుతం లూసిఫర్ రీమేక్‌లో నటిస్తున్నాడు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నిజానికి ఒరిజినల్‌లో హీరోయిన్ ఉండదు. తెలుగులో కూడా చిరంజీవికి హీరోయిన్ లేదనే తెలుస్తుంది. కథను చెడగొట్టకుండా ఉన్నది ఉన్నట్లు కాస్త మార్పులతో చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్.

ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర ఒకటి ఉంటుంది.. అదే హీరో సోదరి పాత్ర. మాతృకలో ఆ పాత్రను ప్రముఖ నటి మంజు వారియర్ చేసింది. ముఖ్యమంత్రి కూతురిగా హుందాగా ఉంటూనే ఎన్నో భావాలను అవలీలగా పలికించారు. తెలుగులో ఆ పాత్ర ఎవరు చేస్తారనే ఆసక్తి చాలా రోజుల నుంచి నడుస్తుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతిని ఈ పాత్ర కోసం అడిగారు అయితే చిరుకు చెల్లిగా నటించడం ఆమెకు యిష్టం లేక నో చెప్పింది. మరోవైపు నయనతార కూడా ఇదే చేసింది. ఇప్పుడే చెల్లి పాత్రలు చేయడానికి నయనతార సిద్ధంగా లేదు. కథ నచ్చినా కూడా ఆ కారణంతోనే నయన్ లూసిఫర్ రీమేక్‌కు నో చెప్పింది.

Megastar Chiranjeevi, Megastar Chijaneevi News, Chiranjeevi Oxygen Banks, chiranjeevi news, Chiranjeevi, Corona Crisis Charity, Chiranjeevi Blood Bank, Chiranjeevi Charitable Trust, Andhra Pradesh, Andhra Pradesh News, AP News, Andhra News, Hyderabad News, Telangana News, Tollywood News, మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి వార్తలు, చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు, చిరంజీవి వార్తలు, చిరంజీవి, కరోనా క్రైసిస్ చారిటీ, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఆంధ్రా వార్తలు, హైదరాబాద్ వార్తలు, తెలంగాణ వాతలు, టాలీవుడ్ వార్తలు, Acharya Movie Updates, Acharya Movie, Ram Charan, Lucifer Movie, ఆచార్యా సినిమా, ఆచార్య అప్ డేట్స్, రామ్ చరణ్, లూసీఫర్
చిరంజీవి (Chiranjeevi)


ఈ పాత్రను చేసేందుకు మరో హీరోయిన్‌ను ఎంపిక చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్ర షూటింగ్ గురించి మేజర్ అప్‌డేట్ వచ్చింది. ఆచార్య మాదిరే ఇందులో కూడా గుడి సెట్ ఒకటి ఉంటుందని తెలుస్తుంది. అక్కడే పూజా కార్యక్రమాలు కూడా అయ్యాయని ప్రచారం జరుగుతుంది. ఆచార్య షూటింగ్ అయిపోయిన వెంటనే లూసీఫర్ రీమేక్‌పై ఫోకస్ చేయనున్నాడు మెగాస్టార్. ఈ సినిమాను 2021లోనే పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు చిరంజీవి. మరి అది ఎంతవరకు పూర్తవుతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: