MAJOR PRE RELEASE EVENT IN SANGAM SARAT THEATER IN VIZAG SB
Major Pre Release Event: వైజాగ్‌లోని ప్రముఖ థియేటర్లో.. మేజర్ ప్రి రిలీజ్ ఈవెంట్ !
మేజర్ ప్రి రిలీజ్ ఈవెంట్ (Twitter/Photo)
మేజర్ పాత్రలో అడివి శేష్ యాక్టింగ్ అమోఘంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో నిర్వహిస్తామని తెలిపాడు అడవి శేష్.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో అడివి శేష్(Adavi Sesh) విలక్షణమైన కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా అడవి శేష్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “మేజర్”(Major). ఈ సినిమాను వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో మేజర్(Major) పాత్రలో అడివి శేష్ యాక్టింగ్ అమోఘంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ఇది వరకు ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి కూడా చెయ్యని విధంగా రిలీజ్ కి ముందే మేజర్ స్పెషల్ ప్రీమియర్స్ షో లని ప్లాన్ చెయ్యగా మేకర్స్ ఇప్పుడు ఒక్కో ప్రాంతంలో ఈ షో లను ప్రదర్శితం చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ షోస్ లో అడివి శేష్ మాత్రం తాను పెరిగిన వైజాగ్ లో స్క్రీనింగ్ ని మరింత స్పెషల్ గా తీసుకున్నాడు. అయితే విశాఖలో ఈ మే 29 సాయంత్రం 4 గంటలకి మేజర్ స్పెషల్ షో పడనుండగా ఈ షో అనంతరమే అక్కడే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Major pre release event) నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ నటించింది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు అడివి శేష్ ప్రమోషన్లో భాగంగా దేశమంతా పర్యటిస్తున్నారు.
ఇక మేజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. 26/11 సంఘటనలు జరిగాక సందీప్ ఉన్ని కృష్ణన్ ఫొటోలు బయటకు వచ్చాక మా కజిన్ పవన్ నాకూ సందీప్‌కు పోలికలు వున్నయని చెప్పాడన్నారు అడవి శేష్. వందలాది మంది ప్రాణాలు కాపాడిన ఆయనకు అశోక్ చక్ర వచ్చినప్పుడు ఆయన గురించి చదివి ఆయనకు ఫ్యాన్ అయ్యానన్నాడు. ఉన్నీ కృష్ణన్ నిజజీవితంలో జరిగిన విషయాలు ఎవరికీ తెలీవన్నారు.హోటల్లో 36 గంటలు ఏం చేశాడనేది తెలుసు. కానీ 31 సంవత్సరాలలో ఆయన జీవితం ఎలా వుందనేది ఎవరికీ తెలీదన్నారు. ఇవన్నీ నేను తెలుసుకున్నాక ఆయన లైఫ్ గురించి ఎందుకు చెప్పకూడదనే ఆలోచన వచ్చిందన్నారు. క్షణం సినిమా తీసిన సమయంలో ఈ ఆలోచన ప్రారంభం అయ్యిందని అడవి శేష్ తెలిపాడు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.