Home /News /movies /

MAJOR MOVIE CROSS 1 MILLION DOLLAR IN US BOX OFFICE AND ITS IMDB RATINGS AND 6 DAYS WORLD WIDE COLLECTIONS DETAILS TA

Major : US బాక్సాఫీస్ దగ్గర ’మేజర్’ మూవీ మరో మైలురాయి. అడివి శేష్ కెరీర్‌లో తొలిసారి..

మేజర్ మూవీ మరో రికార్డు  (Photo Twitter)

మేజర్ మూవీ మరో రికార్డు (Photo Twitter)

Major 6 Days Collections :  అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. జూన్ 3న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలైన ఈ సినిమా యూఎస్ మార్కెట్‌లో 1 మిలియన్ యూఎస్ డాలర్స్ మార్క్‌ను అందుకుంది.

ఇంకా చదవండి ...
    Major 6 Days WW Collections : అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’.  ఈ సినిమా జూన్ 3 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు శశి కిరణ్ తిక్క. మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు  అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది.  ‘మేజర్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

    ఇక తాజాగా 6వ రోజు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. హీరోగా అడివి శేష్‌కు తొలి 1 మిలియన్ డాలర్ మూవీ ఇదే కావడం విశేషం.  ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళ్లు రాబట్టిందంటే.. మేజర్ మూవీ సినిమా చూసి ప్రముఖులు ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. ఇక6వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 0.73 కోట్ల షేర్ (రూ. 1.20 కోట్ల గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 1.22 కోట్ల షేర్ (రూ. 2.25 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి సాలిడ్‌గా దూసుకుపోతుంది.

    యూఎస్‌లో 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టిన మేజర్ మూవీ (Twitter/Photo)


    మేజర్ 6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
    Nizam: రూ. 6.66 కోట్లు
    Ceeded: రూ. 1.59 కోట్లు
    UA: రూ. 1.76 కోట్లు
    East: రూ. 1.19 కోట్లు
    West: 77L
    Guntur: 94L
    Krishna: 89L
    Nellore: 59L
    AP-TG Total:- రూ. 14.39 కోట్లు (24.100Cr Gross)
    KA+ROI:- రూ. 1.55Cr
    Hindi – రూ. 3.20 Cr
    OS: 5.32Cr
    వరల్డ్ వైడ్ మొత్తం:- 24.46 CR(44.75CR Gross)                                                                          ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే.. బాక్సాఫీస్ దగ్గర రూ. 14 కోట్లు వసూళు చేయాలి. కానీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని .. రూ. 5.46 కోట్లు లాభాల్లోకి వచ్చింది.



    ఇక ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB మేజర్ మూవీకి 9.2 / 10 రేటింగ్ ఇచ్చింది. గతంలో అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ మూవీకి 7.8/10 రేటింగ్ ఇచ్చింది.  ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్‌‌లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Adivi Sesh, Major Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు