Home /News /movies /

MAJOR ADIVI SESH MAJOR MOVIE TRAILER RELEASE DATE ANNOUNCEMENT TA

Major - Adivi Sesh : అడివి శేష్ ‘మేజర్’ మూవీ ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్ డేట్ ఫిక్స్..

అడివి శేష్ ‘మేజర్’ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

అడివి శేష్ ‘మేజర్’ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

Adivi Sesh - Major:  అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించకున్న ఈ చిత్రానిెకి సంబంధించిన ట్రైలర్‌ను ఎపుడు ప్రకటించేది వెల్లడించారు.

ఇంకా చదవండి ...
    Adivi Sesh - Major:  అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ఓమైక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ రూపంలో దేశ వ్యాప్తంగా ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోన్న ఆ సమయంలో ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కేసులు తగ్గడంతో ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’, ఆచార్య’సినిమాలు తమ సినిమాల కొత్త విడుదల తేదిలు ప్రకటించాయి. ఈ కోవలోనే అడివి శేష్ నటించిన ‘మేజర్’ మూవీ కూడా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను మే 27న విడుదల  కానున్నట్టు  ఆ తర్వాత ప్రకటించారు.

    ఇ ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ  చిత్రాన్ని తాజాగా జూన్ 3న ఒక వారం గ్యాప్ తర్వాత విడుదల చేస్తున్నారు. మే 27న ఈ సినిమాతో పాటు వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ మూవీ పోటీలో ఉండటం... ఈ  సినిమా పూర్తి స్థాయి హిల్లేరియస్ కామెడీతో వస్తోంది. దీంతో తన సినిమాను ఒక వారం రోజుల తర్వాత విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సోలో రిలీజ్ ‘మేజర్’ మూవీకి కలిసొచ్చే అంశాలు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న విడుదల చేస్తున్నట్టు ఓ ప్రోమోను విడుదల చేశారు.


    ’మేజర్`(Major) సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కించారు.సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగుతో పాటు హిందీ,మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో  తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.

    RRR - Jr NTR : RRRతో రామ్ చరణ్‌, ప్రభాస్‌, యశ్‌లకు సాధ్యం కానీ రికార్డుకు క్రియేట్ చేసిన ఎన్టీఆర్..

    ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. అంతేకాదు ఈ సినిమాను దేశ వ్యాప్తంగా 75 లొకేషన్స్‌లలో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. అంతేకాదు ‘మేజర్’ మూవీని తెలుగు, హిందీతో పాటు మలయాళంలో మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు.

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మరో షాకింగ్ డెసిషన్.. ? షాక్‌లో అభిమానులు..


    మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 29న విడుదల కానుంది.  మరోవైపు అడివి శేష్.. ‘గూఢచారి’ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.దే..
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Adivi Sesh, Major film, Tollywood

    తదుపరి వార్తలు