Adivi Sesh - Major: అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ’మేజర్`(Major) సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కించారు.సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
తెలుగుతో పాటు హిందీ,మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
The release of #MajorTheFilm stands postponed owing to the pandemic.
The new release date would be announced at the earliest possible.@AdiviSesh @saieemmanjrekar #SobhitaDhulipala @SashiTikka #SriCharanPakala @sonypicsindia @urstrulyMahesh @GMBents @AplusSMovies @ZeeMusicsouth pic.twitter.com/G6n86cbXNC
— BA Raju's Team (@baraju_SuperHit) January 24, 2022
ఓమైక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ రూపంలో దేశ వ్యాప్తంగా ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో పాటు సగం ఆక్యుపెన్షీతోనే థియేటర్స్ రన్ చేస్తున్నాయి. ఈ కారణంగా ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేశారు. ఈ కోవలోనే మేజర్ మూవీ కూడా చేరింది.
‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. అంతేకాదు ఈ సినిమాను దేశ వ్యాప్తంగా 75 లొకేషన్స్‌లలో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. అంతేకాదు ‘మేజర్’ మూవీని తెలుగు, హిందీతో పాటు మలయాళంలో మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు.
Jayaram Corona Positive : ‘అల వైకుంఠపురములో’ నటుడు జయరామ్‌కు కరోనా పాజిటివ్..
మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. కాగా ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. మరోవైపు అడివి శేష్.. ‘గూఢచారి’ సినిమా సీక్వెల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adivi Sesh, Bollywood news, Major film, Tollywood