Home /News /movies /

MAJOR ACTOR ADIVI SESH SHARES EMOTIONAL POST WITH SANDEEP UNNIKRISHNAN MOM SB

Major: మేజర్ చూసి అడవిశేష్‌ను కౌగిలించుకొని... కన్నీళ్లు పెట్టుకొన్న సందీప్ తల్లి !

అడవి శేష్

అడవి శేష్

మేజర్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మేజర్ మూవీపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

    అడవి శేష్ (Advi Sesh)  నటించిన మేజర్ సినిమా (Major Movie) ఇవాళ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసి చాలామంది ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్నట్లు తెలుస్తోంది. 26/11 ముంబయ్‌ దాడుల్లో (Mubai Attacks)వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ ‘సందీప్‌ ఉన్నికృష్ణన్‌’ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శశికిరణ్‌ తిక్క దర‍్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో యంగ్‌ హీరో అడవి శేష్‌ నటించిన విషయం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మేజర్.

    ఈ సినిమా విడుదల సందర్భంగా అడవి శేష్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సినిమా విడుదలకు ముందు రోజు సందీప్‌ తల్లిని అడవి శేష్‌ ఆత్మీయంగా ఆలీంగనం చేసుకున్నాడు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'అంకుల్‌, అమ్మ మీ ఇద్దరి కోసం రేపు మేజర్‌ సినిమా విడుదల కాబోతుంది' అని రాసుకొచ్చాడు. ఇక అడవి శేష్ పెట్టిన ఈ పోస్టుపై చాలామంది అభిమానులు స్పందిస్తున్నారు. నువ్వు గర్వపడేలా చేశారు అంటూ అడవి శేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సందీప్ ఉన్నీకృష్ణణన్ తండ్రితో కూడా ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టాడు మేజర్ హీరో.








    View this post on Instagram






    A post shared by Sesh Adivi (@adivisesh)





    ఈ సినిమా చూసి రియల్‌ హీరో సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ తండ్రి కె. ఉన్ని కృష్ణన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాన్ని ప్రతిబింబించేలా చాలా బాగా చూపించారన్నారు. చాలా మంచి సినిమా తెరకెక్కించారన్నారు. చిత్రబృందానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్‌ ఎంతో బాగుందన్నారు. మా దుఃఖాన్ని మరిచేలా చేసింది అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. హైదరాబాద్‌కు మళ్లీ మళ్లీ వస్తాను.' అని సందీప్‌ తండ్రి కె. ఉన్ని కృష్ణన్‌ పేర్కొన్నారు.

    మరోవైపు మేజర్ సినిమాను చూసి మహేష్ బాబు కూడా కాసేపు ఏం మాట్లాడలేకపోయారన్నారు అడవి శేష్ . సినిమా చూశాక ఆయన గొంతు తడారిపోయిందని కాసేపు ఏం మాటలు రాలేవన్నారు. మహేష్ బాబు కళ్లలో కన్నీళ్లు చూసి తనకు కూడా టెన్షన్ వచ్చిందన్నారు హీరో అడవి శేష్. ఇక మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం అడివి శేష్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నాడు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Adavi sesh unhealty, Adivi Sesh, Major film, Major Movie

    తదుపరి వార్తలు