MAJILI DIRECTOR SHIVA NIRVANA BLESSED WID BABY BOY RECENTLY AND TWEETED HIS SON PHOTO PK
కొడుకు పుట్టాడు.. హిట్ కొట్టాడు.. శివ నిర్వాణ మరో మజిలీ..
శివ నిర్వాణ ట్విట్టర్ ఫోటో
కొన్నిసార్లు టైమ్ బాగా కలిసొస్తుంది. ఇప్పుడు శివ నిర్వాణ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే మజిలీ సినిమా విజయంతో గాల్లో తేలిపోతున్నాడు ఆ దర్శకుడు. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది.
కొన్నిసార్లు టైమ్ బాగా కలిసొస్తుంది. ఇప్పుడు శివ నిర్వాణ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే మజిలీ సినిమా విజయంతో గాల్లో తేలిపోతున్నాడు ఆ దర్శకుడు. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది. నిన్ను కోరి సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన ఈయన.. ఇప్పుడు రెండో సినిమాతో కూడా అంచనాలు అందుకున్నాడు. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 20 కోట్ల వరకు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సంతోషంలో ఉండగానే ఇప్పుడు మరో సంతోషకరమైన వార్త కూడా విన్నాడు శివ నిర్వాణ. తాజాగా ఈయన తండ్రి అయ్యాడు. ఇన్నాళ్లూ భర్తగా ఉన్న ఈయన ఇప్పుడు నాన్న ప్రమోషన్ అందుకున్నాడు.
Blessed wid babyboy recently❤️Na Majili lo oka bujji malupu can’t ask anything more than this❤️❤️ pic.twitter.com/XrVgbkRMvp
ఈ సందర్భంగా తన వారసున్ని ఎత్తుకుని ఫోటో దిగాడు శివ. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. తాను తండ్రి అయిన విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించాడు శివ. తన జీవితంలో మరో మజిలీ మొదలైందని చెబుతున్నాడు ఈ కుర్ర దర్శకుడు. శివ నిర్వాణ తండ్రి అయ్యాడని తెలిసిన వెంటనే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు విషెస్ తెలియజేసారు. మొత్తానికి హిట్ కొట్టడం.. కొడుకు పుట్టడం.. ఇలా జీవితంలో అన్నీ సంతోషకరమైన వార్తలే వింటున్నాడు ఈ దర్శకుడు. ఈయన తన తర్వాతి సినిమాను స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.