హోమ్ /వార్తలు /సినిమా /

Suma Cash Show: సుమ క్యాష్ గేమ్ షో రహస్యాలు.. సామాన్లు నిజంగా పగలగొడతారా.. లక్షలిస్తారా..?

Suma Cash Show: సుమ క్యాష్ గేమ్ షో రహస్యాలు.. సామాన్లు నిజంగా పగలగొడతారా.. లక్షలిస్తారా..?

Suma Cash Show: తెలుగు బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న గేమ్ షోలలో క్యాష్ ఒకటి. ఈటీవిలో వచ్చే ఈ షోకు రేటింగ్ కూడా బాగానే వస్తుంది. అయితే ఈ షోపై కొందరికి కొన్ని అనుమానాలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండేదంతా..

తెలుగు బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న గేమ్ షోలలో క్యాష్ ఒకటి. ఈటీవిలో వచ్చే ఈ షోకు రేటింగ్ కూడా బాగానే వస్తుంది. అయితే ఈ షోపై కొందరికి కొన్ని అనుమానాలు చాలా ఏళ్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండేదంతా నిజమేనా.. నిజంగానే వాళ్లకు అన్ని లక్షలు ఇస్తారా.. పైగా షో చివర్లో పడేసే సామాన్లు అన్నీ నిజమేనా..? అసలేంటి ఈ సంగతి.. ఎందుకిలా చేస్తుంటారు అని చాలా అంటే చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఇందులో కూడా చాలా వరకు ట్విస్టులు ఉన్నాయి. ఈ షోలో చూసేవన్నీ నిజాలు అయితే కావు. కానీ కొంతవరకు మాత్రం నిజమే ఉంటుంది. అసలు ఏది నిజం.. ఏది అబద్ధం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు విషయం ఏంటంటే క్యాష్ ప్రోగ్రామ్‌తో పాటు మిగిలిన అన్ని గేమ్ షోలు కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంటాయి. అందులో వచ్చే సెలబ్రిటీస్ కూడా గేమ్ ఆడుతుంటారు. అయితే వాళ్లకు ఇచ్చే ప్రైజ్ మనీ మాత్రం నిజం కాదు. అది కేవలం పబ్లిసిటీ మాత్రమే. తిరిగి ఆ షోకు వచ్చినందుకు వాళ్లకే డబ్బులు ఇస్తుంటారు. వాళ్ల రేంజ్‌ను బట్టి ఒక్కొక్కరికి ఎపిసోడ్‌కు 5 నుంచి 20 వేల వరకు కూడా ఇస్తుంటారు. సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చే వాళ్లకు మాత్రం ఎలాంటి డబ్బులు ఉండవు.

anchor suma cash behind secrets,anchor suma cash pakdo pakdo round,anchor suma,anchor suma cash show,suma's cash game show,cash game show,anchor suma in cash program,anchor suma in cash program shooting,suma cash show promos,క్యాష్ ప్రోగ్రామ్‌లో సీక్రేట్స్,సుమ క్యాష్ ప్రోగ్రామ్,తెలుగు సినిమా
యాంకర్ సుమ (Anchor Suma)

ఇక ఈ షోకు వచ్చే స్టూడెంట్స్ విషయంలో మరో లెక్క ఉంటుంది. వాళ్లకు ఎలాంటి డబ్బులు ఉండవు కానీ భోజనాలు మాత్రం ఏర్పాటు చేస్తుంటారు. గతంలో అయితే జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చే వాళ్లు. వాళ్లు ఒకరోజు 500 నుంచి 750 వరకు తీసుకుంటారు. ఒకేరోజు మూడు నాలుగు ఎపిసోడ్స్ షూట్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ వల్ల ఆ డబ్బు కూడా సేవ్ అయిపోతుంది.

anchor suma cash behind secrets,anchor suma cash pakdo pakdo round,anchor suma,anchor suma cash show,suma's cash game show,cash game show,anchor suma in cash program,anchor suma in cash program shooting,suma cash show promos,క్యాష్ ప్రోగ్రామ్‌లో సీక్రేట్స్,సుమ క్యాష్ ప్రోగ్రామ్,తెలుగు సినిమా
యాంకర్ సుమ (Anchor Suma)

మరోవైపు కొన్ని గేమ్ షోలు మాత్రం కామన్ ఆడియన్స్‌తో ఆడిస్తుంటారు. వాటికి ఆడిషన్స్ పెడుతుంటారు. అందులో వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వరు.. హైలైట్ అవుతారంతే. అయితే వాళ్లు గెలుచుకున్న గిఫ్టులు మాత్రం ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఢీ లాంటి షోలలో మాత్రం విజేతలకు ఇచ్చే డబ్బులు నిజమే. అయితే వాళ్లు లక్ష గెలిస్తే అందులో 40 శాతం ట్యాక్స్ కట్ చేసుకుంటారు.

anchor suma cash behind secrets,anchor suma cash pakdo pakdo round,anchor suma,anchor suma cash show,suma's cash game show,cash game show,anchor suma in cash program,anchor suma in cash program shooting,suma cash show promos,క్యాష్ ప్రోగ్రామ్‌లో సీక్రేట్స్,సుమ క్యాష్ ప్రోగ్రామ్,తెలుగు సినిమా
యాంకర్ సుమ (Suma kanakala/ Twitter)

చివరగా క్యాష్ విషయానికి వస్తే చాలా మందికి ఉన్న అనుమానం చివర్లో వచ్చే పకడో పకడోలో నిజంగానే సామాన్లు పగిలిపోతాయా అని.. ఇందులో కూడా చిన్న లాజిక్ ఉంటుంది. అక్కడ పగలకొట్టడానికి ఆల్రెడీ పాత సామాను ఉంటుంది. వాటి విలువ మొత్తం కలిపితే కనీసం 5 నుంచి 8 వేల మధ్యలో కూడా ఉండదు. అలాంటివి సెట్ చేసి కింద పడేస్తుంటారు. వాటినే కొత్త వాటిలా చూపిస్తారు. ఇలా గేమ్ షోలతో పాటు మిగిలిన వాటిలో కూడా చాలా లాజిక్స్ ఉంటాయి.

First published:

Tags: Anchor suma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు