ఇటీవల కాలంలో చాలామంది ప్రముఖ హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడుతున్నారు. సోనాలి బింద్రే క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. మనీషా కోయిరాల కూడా క్యాన్సర్ బారిన పడి పోరాడి గెలిచారు. తాజాగా బాలీవుడ్‌కు(Bollywood) చెందిన ప్రముఖ హీరోయిన్ క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి మహిమా చౌదరి(Mahima Chaudhry) కేన్సర్ బారిన పడ్డారు. మహిమా చౌదరి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్నట్టు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రకటించారు. ఇన్ స్టా గ్రామ్ లో ఇందుకు సంబంధించి ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మహిమను అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఒక హీరోగా అభివర్ణించారు. ‘‘అభిమానులకు ఈ విషయాన్ని నేనే చెప్పాలని ఆమె ఆశించారు’’ అని అనుపమ్ ఖేర్ తెలిపారు.
మహిమా చౌదరి ధైర్యం, కేన్సర్ కు సంబంధించిన కథనం అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘నా 252వ చిత్రం ‘ద సిగ్నేచర్’లో కీలక పాత్ర పోషించే విషయమై నేను నెల క్రితం అమెరికా నుంచి మహిమా చౌదరికి కాల్ చేశాను. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ ఉందని అప్పటి సంభాషణతో నాకు తెలిసింది. ఆమె వైఖరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలకు ఆశను కల్పిస్తుంది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకుంది’’ అని అనుపమ్ ఖేర్ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. స్నేహితులారా ఆమెకు మీ ప్రేమ, దీవెనలు, ప్రార్థనలు అందించండని కోరారు.
దీనిపై మహిమ చౌదరి కూడా స్పందించింది. ‘‘తన సినిమాలో నటించాలని అనుపమ్ నాకు కాల్ చేశారు. ఆ సమయలో నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను. వెబ్ షోలు, సినిమాల్లో నటించాలంటూ నాకు ఎన్నోకాల్స్ వస్తున్నాయి. కానీ నేను యస్ అని చెప్పలేను. ఎందుకంటే నాకు శిరోజాలు లేవు’’ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనకు కేన్సర్ లక్షణాలు ఏవీ లేవని, సాధారణ చెకప్ ల్లో అది బయటపడినట్టు ఆమె చెప్పారు.
View this post on Instagram
దీంతో ఈ విషయం తెలుసుకున్న మహిమ చౌదరి అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ... సెలబ్రిటీలు కూడా మహిమకు ధైర్యాన్ని ఇస్తున్నారు.ఇటు నెటిజన్లు కూడా... మహిమ చౌదరి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నామంటూ పోస్టు పెట్టారు. మహిహ వయసు ప్రస్తుతం 47 ఏళ్లు. ఆమె 1997లో వచ్చిన పరదేశీ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anupam Kher, Bollywood