షఓ టీవీ నటికి పబ్లిక్‌గా ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. నటి ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న అతడు... ఆమెకు బెదిరింపులకు దిగారు. అత్యాచారం చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడని నటి పేర్కొంది. ఈ ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగింది. వివరాల్లోకి వెళ్త.. టీవీ నటి మహి విజ్ ఈ షాకింగ్ ఘటనను ఎదుర్కొంది. మే 7వ తేదీని మహి ప్రయాణిస్తున్న కారును ఓ అపరిచిత వ్యక్తి ఢీకొట్టాడు. ఆ తర్వాత అతడు కారు దిగి దుర్భాషలాడుతూ.. మహిని అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ సమయంలో మహి తన కూతురు తారాతో కలిసి కారులో ఉంది.
This person banged my car got abusive and gave me rape threats his wife got aggressive and said chod de isko @MumbaiPolice help me find this guy who is threat to us pic.twitter.com/XtQbt1rFbd
— Mahhi vij (@VijMahhi) May 7, 2022
వెంటనే మహి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అపరిచిత వ్యక్తి కారు నంబర్ ప్లేట్‌తో ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "ఈ వ్యక్తి నా కారును ఢీ కొట్టాడు. తనను అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అతని భార్య దూకుడుగా ఉంది అతడు భర్తను ఈమెను వదిలేయ్ అంటూ... చెబుతోంది. అంటూ వీడియోను షేర్ చేసింది. ముంబై పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. ఈ వ్యక్తి ఎవరో కనుక్కొని తనకు సాయం చేయాలంటూ పోలీసులను ట్వీట్ ద్వారా కోరింది. అయితే మహి చేసిన పోస్టుపై ముంబై పోలీసులు వెంటనే స్పందించారు. "దయచేసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మీ ఫిర్యాదును నమోదు చేయండి" అని చెప్పారు. దీంతో మహి పోలీసులు ఇచ్చిన సూచన మేరకు దగ్గర్లో ఉన్న వర్లీ స్టేషన్‌ను వెళ్లినట్లు తెలిపింది. అక్కడున్న పోలీసులు తనకు సాయం చేస్తానని చెప్పారిన ఆమె మరో ట్వీట్ చేసింది.
Seriously tara was in the car I was scared for her https://t.co/QqXeBP65Me
— Mahhi vij (@VijMahhi) May 8, 2022
నటి మహి చేసిన ట్వీట్లపై పలువురు నెటిజన్స్ కూడా స్పందిస్తున్నారు. భగవంతుడు.. మన చుట్టూ ఏం జరుగుతుంది. మనం ఎక్కడ ఉన్నాం. ఇలాంటివి సహించ కూడదు. ఈ విషయాన్ని సీరియస్‌గా పైవాళ్ల వరకు తీసుకెళ్లాలి. నిజంగా చాలా భయానకం అంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టింది. ఆ పోస్టుకు కూడా మహి రిప్లై ఇచ్చింది. అవును నిజమే.. ఆ సమయంలో నాతో పాటు నా కూతురు కూడా చాలా భయపడిపోయింది అంటూ మహి రిప్లై ఇచ్చింది.
ఇక మహి ప్రొఫషనల్ లైఫ్ చూస్తే.. ఆమె చాలా పాపులర్ షోలలో నటించింది. లగి తుజ్‌సే లగన్, బాలిక వధులో మహి నటించింది. నటుడు జై భనుషాలిని ఆమె వివాహం చేసుకుంది. వీరిద్దరూ ... కూడా డాన్స్ రియాలిటీ షో నచ్ బలియేలో కూడా కలిసి పాల్గొన్నారు. ఈ జంటకు ఆగష్టు 3..2019న ఓ కూతురు కూడా పుట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Tv actress