హోమ్ /వార్తలు /సినిమా /

మహా శివరాత్రి రోజు ‘మహర్షి’ దర్శనం...

మహా శివరాత్రి రోజు ‘మహర్షి’ దర్శనం...

మహేష్ బాబు (File)

మహేష్ బాబు (File)

Mahesh Maharshi | ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో టీజర్‌ను రెడీ చేస్తున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దిల్ రాజు, సి.అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ మంచి రేటుకే అమ్ముడుపోయింది.


‘మహర్షి’ సినిమాను ముందుగా ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మహేష్ మనుసు మార్చుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో టీజర్‌ను రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఆ రెండో టీజర్‌ను మహా శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నట్టు సమాచారం. అదే రోజు ఈ సినిమా విడదలు తేదిని అఫీషియల్‌ ప్రకటించే అవకాశం ఉంది.


Mahesh's Maharshi Release Date Suspence Continue మహేష్ సినిమాపై సస్పెన్స్ వీడేది అపుడే..
మహేశ్ ‘మహర్షి’


ఈ సినిమాలో మ‌హేష్ బాబు మ‌రోసారి శ్రీ‌మంతుడుగా తరహా పాత్రలో నటిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు అమెరికాలో ఓ కార్పోరేట్ కంపెనీ సిఈఓగా ఉన్న మ‌హేశ్.. త‌న స్నేహితుడి కోసం మాతృదేశం తిరగి వ‌స్తాడ‌ని.. ఇక్క‌డ ఆయ‌న కోసం అన్ని వ‌దిలేసుకుని మామూలు మ‌నిషిలా బ‌తుకుతాడని తెలుస్తుంది.ఆ స్నేహితుడిగా అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్నాడు.


Mahesh's Maharshi Release Date Suspence Continue, మహేష్ సినిమాపై సస్పెన్స్ వీడేది అపుడే..ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు ..వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్‌కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో టీజర్‌ను రెడీ చేస్తున్నట్టు సమాచారం.
మహేశ్ నరేష్ ట్విట్టర్ ఫోటోస్


ఆయ‌న కోస‌మే అన్నీ వ‌దిలేసుకుని వ‌చ్చి ఉన్న ఊరును కూడా బాగు చేస్తాడ‌ని.. ఒక‌ప్పుడు హిందీలో షారుఖ్ హీరోగా వ‌చ్చిన ‘స్వదేశ్’ క‌థ ఆధారంగా ఇది సాగుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. గ‌తంలో ‘శ్రీ‌మంతుడు’ సినిమాలో కూడా ఊరు ద‌త్త‌త తీసుకుని బాగు చేసే పాత్ర‌లో న‌టించాడు మ‌హేశ్ బాబు. మ‌రోసారి అలాంటి పాత్ర‌లోనే క‌నిపించ‌బోతున్నాడు సూప‌ర్ స్టార్. మరి ఈ సినిమాతో మహేష్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా వెయిట్ అండ్ సీ.


పూనమ్ పాండే హాట్ ఫోటోస్ఇవి కూడా చదవండి 


అటు కొరటాల శివ.. ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మధ్యలో చిరంజీవి..


అతనే దీనికి కారణం...విద్యా బాలన్


పోర్న్ స్టార్‌గా మారిపోయిన ర‌మ్య‌కృష్ణ‌.. అభిమానుల‌కు షాక్..

First published:

Tags: Mahesh babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు