Maheshbabu B'Day : 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మహేష్ బాబు... సంబరాల్లో ఫ్యాన్స్

Maheshbabu Birth Day : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నేడు 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఆ సందర్భంగా... ప్రిన్స్ ఫ్యాన్స్ నుంచీ... సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 7:39 AM IST
Maheshbabu B'Day : 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మహేష్ బాబు... సంబరాల్లో ఫ్యాన్స్
మహేష్ బాబు
Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 7:39 AM IST
తన కెరీర్‌లో 25వ చిత్రంగా... మహర్షి సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న ప్రిన్స్ మహేష్ బాబు... నేడు 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా... ప్రిన్స్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఎవర్ గ్రీన్ హీరోపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రస్తుతం 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు మహేష్. ఈమధ్యే మొదలైన ఈ సినిమాకి 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ పెట్టారు. ఇందులో మహేష్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా... 13 ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్... విజయశాంతి ఈ సినిమా ద్వారా తిరిగి వెండితెరపై ఎంట్రీ ఇస్తోంది. ఇక అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు.




రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, కామెడీ, ఫైట్స్, అన్నీ కలగలిపి... రావిపూడి సరిలేరు నీకెవ్వరును రెడీ చేస్తున్నట్లు తెలిసింది. "అనిల్‌ రావిపూడితో కలిసి సూపర్‌స్టార్‌ తెరపై సందడి చేయబోతున్నారు. సిద్ధంగా ఉండండి" అని ఈ సినిమా నిర్మాత అనిల్‌ సుంకర ఈమధ్యే తెలిపారు. సంక్రాంతికి ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందుకే సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Loading...


ఈ సినిమాలో విజయశాంతితోపాటూ... ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఇస్తున్నాడు.





First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...