MAHESH WILL DO A MOVIE WITH YOUNG DIRECTOR UNDER KORATALA SIVA OBSERVATION MHN
Super Star Mahesh: కొరటాల శివ పర్యవేక్షణలో యంగ్ డైరెక్టర్‌కి మహేశ్ ఓకే అంటాడా?
Mahesh will do a movie with young director under Koratala siva observation
Super Star Mahesh - Koratala Siva: ప్రస్తుతం టిప్రులార్లో బిజీగా ఉన్న రాజమౌళి ఆ సినిమాను పూర్తి చేసి మహేశ్‌తో సినిమా చేయడానికి సమయం పట్టేలా ఉంది. దీంతో గ్యాప్‌లో మహేశ్ మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.
సినిమాల ఎంపికలో సూపర్‌స్టార్ చాలా కచ్చితంగా ఉంటారు. స్క్రిప్ట్ నచ్చితేనే ఓకే చెబుతారు... లేకుంటే లేదు. ఎంత క్లోజ్‌గా ఉండే దర్శకుడైనా మహేశ్ సినిమాల ఎంపిక విషయంలో మోహమాటం చూపడు. ఇప్పుడు మహేశ్ పరశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేశ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే దానిపై క్లారిటీ ఉంది. రాజమౌళితో మహేశ్ సినిమా ఉంటుందని ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు. అయితే రాజమౌళి సినిమా ట్రాక్ ఎక్కడం అంటే అంత సులువుగా జరగదు. చాలా వర్క్ చేస్తాడు జక్కన్న. అందుకు చాలా సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో మహేశ్ మరో సినిమాను చేయాలనుకుంటున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల ముందు వంశీ పైడిపల్లితో మహేశ్ సినిమా ఉండే అవకాశాలున్నాయని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే లేటెస్ట్ సమాచారం మేరకు మహేశ్‌తో ఓ యంగ్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. వెంకీ కుడుముల. వరుణ్‌తేజ్‌తో 'తొలిప్రేమ' చేసి హిట్ కొట్టిన ఈ దర్శకుడికి 'మిస్టర్ మజ్ను' ఫలితం నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు నితిన్‌తో 'రంగ్ దే' సినిమాను చేస్తున్నాడు వెంకీ కుడుముల. ఈ సినిమా తర్వాత మహేశ్‌తో సినిమా చేయడానికి వెంకీ కుడుముల కథను సిద్ధం చేస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ ప్రాజెక్ట్‌ను ట్రాక్ ఎక్కించడానికి రెడీ అయ్యాడట. వెంకీ కుడుముల చెప్పిన పాయింట్ నచ్చడంతో మహేశ్.. వెంకీ కుడుములను డైరెక్టర్ కొరటాల శివ పర్యవేక్షణలో స్క్రిప్ట్ సిద్ధం చేయమని సూచించాడట. ఇప్పుడు స్క్రిప్ట్ సిద్ధమైతే మహేశ్ సినిమాను ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ట్రాక్ ఎక్కించేస్తాడని టాక్.
పండగ తర్వాత మహేశ్ తన 27వ చిత్రం 'సర్కారు వారి పాట'ను ట్రాక్ ఎక్కించబోతున్నాడు. ముందు ఇండియాలో షెడ్యూల్‌ను పూర్తి చేస్తారు. మార్చికంతా ఇండియాలో చిత్రీకరించాల్సిన పార్ట్‌ను చిత్రీకరించి, ఏప్రిల్‌లో యు.ఎస్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారంటున్నారు. కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.