మహేష్ బాబును కాలేజ్‌కు పంపాల్సిందే అంటోన్న పరశురామ్..

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత సినిమాను దర్శకుడు పరశురామ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: May 11, 2020, 2:06 PM IST
మహేష్ బాబును కాలేజ్‌కు పంపాల్సిందే అంటోన్న పరశురామ్..
మహేష్, పరశురామ్ (Mahesh parasuram movie)
  • Share this:
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత సినిమాను దర్శకుడు పరశురామ్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇంతకు ముందే పరశురామ్ ఓ మీడియాతో మాట్లాడుతూ కన్ఫామ్ చేశాడు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మే 31న కృష్ణ గారి పుట్టిన రోజు కానుకగా వెలువడనుంది. సరిలేరు నీకవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ అనేక మంది దర్శకుల నుండి కథలు విని చివరకు పరశురామ్ తో కమిట్ అయ్యాడు. పరశురామ్.. మహేష్ ఇమేజ్ కి తగ్గట్టు ఓ అదిరిపోయే మాస్ కమర్షియల్ ఎంటరైనర్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఐతే ఈ సినిమాలో మహేష్ పాత్ర గురించి ఓ ఆసక్తి కర ప్రచారం టాలీవుడ్ లో నడుస్తుంది. అదేంటంటే కథ ప్రకారం ఈ సనిమాలో మహేష్ మరోసారి స్టూడెంట్ గా కనిపిస్తాడట. అందుకోసం ఆయన కొంచెం బరువు కూడా తగ్గుతున్నారని సమాచారం. ఇక మరోవైపు మహేష్ కోసం హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ సరసన మొదట హిందీ నటి కియారాను తీసుకోవాలనీ చూశారట. ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. ఐతే ఈ ప్రాజెక్ట్ ని కియారా సున్నితంగా తిరస్కరించింది. కారణం కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అని చెప్పేసిందట. కియారా నో అనడంతో మహేష్ సరసన నటించే మరో అమ్మాయి ఏవరైతే బాగుంటారనీ ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా కీర్తి సురేష్‌ను కూడా చిత్రబృదం పరిశీలిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందించనున్నాడు.
First published: May 11, 2020, 2:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading