పూరితో మరోసారి మహేష్.. మూడో సినిమాకు సై...

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్లి లైమ్ లైట్‌లోకి వచ్చాడు.

news18-telugu
Updated: March 25, 2020, 2:04 PM IST
పూరితో మరోసారి మహేష్.. మూడో సినిమాకు సై...
మహేష్, పూరి Photo : Twitter
  • Share this:
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్లి లైమ్ లైట్‌లోకి వచ్చాడు. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో పూరి టేకింగ్‌కి.. రామ్ ఎనర్జీ తోడవడం పాటు పూరి రాసిన డైలాగ్స్ ‌తో  తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మొత్తం అదిరిపోయాయి. ఈ సినిమా మాస్‌ను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత పూరి.. విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా దాదాపు 40 రోజుల పాటు ముంబైలో షూటింగ్ జరుపుకుని హైదరాబాద్ చేరుకుంది. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అది అలా ఉంటే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. మహేష్ ప్రస్తుతం ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. ఏవో కారణాలతో వంశీ పైడిపల్లితో అనుకున్న సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. దీంతో ఆయన అనేక కథల్నీ వింటున్నాడు. అందులో భాగంగా కొంత కాలం ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్నారని టాక్ వచ్చింది. ఆ తర్వాత గీతా గోవిందం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా అన్నారు. ఇంతవరకు ఏదీ ఫైనల్ కాలేదు. తాజాగా ఓ అదిరిపోయే వార్త హల్ చల్ చేస్తోంది. గతంలో పూరి జగన్నాథ్, మహేశ్ బాబు 'పోకిరి' .. 'బిజినెస్ మేన్' వంటూ సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. ఆ మధ్య మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాలని పూరి ప్రయత్నించాడు. అయితే ఏవో కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.

అంతేకాదు ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా రావడం వల్లనే మరో ప్రాజెక్టు సెట్ కాలేదనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ను మళ్లీ సెట్ చేయాలనే ఉద్దేశంతో సన్నిహితులు కొందరు రంగంలోకి దిగారట. ఇస్మార్ట్ శంకర్ వంటీ సూపర్ హిట్ ఇచ్చిన పూరితో సినిమా చేయడానికి మహేశ్ బాబు కూడా మొగ్గుచూపుతున్నాడని సమాచారం. దీంతో ఒకవేళ కనుక ఈ ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే పూరి మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూడో సినిమా రావడం ఖాయమేననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
First published: March 25, 2020, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading