HOME » NEWS » movies » MAHESH TO PRODUCE A FILM WITH VIJAY DEVARAKONDA AS HERO HERE ARE THE DETAILS SR

మహేష్ బాబు నిర్మాతగా విజయ్ దేవరకొండ సినిమా ఫిక్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్‌తో ఓ సినిమా చేయనున్నాడు.

news18-telugu
Updated: May 10, 2020, 6:40 AM IST
మహేష్ బాబు నిర్మాతగా విజయ్ దేవరకొండ సినిమా ఫిక్స్..
విజయ్, మహేష్ (mahesh babu vijay devarakonda)
  • Share this:
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో తన ఎంటో చూపిస్తున్నాడు. ఆయన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత ఇంతవరకు మరే సినిమాను ప్రకటించలేదు. అయితే గీత గోవిందంతో బంపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్‌తో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమా గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అది అలా ఉంటే ఆయన గురించి మరో విషయం ఆసక్తిని రేపుతోంది. అది ఏమంటే యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఆయన ఓ సినిమాను నిర్మించనున్నారట. మహేష్ ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తూనే .. మరో వైపున నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే మహేష్ బాబు, ఈ మధ్యనే రూట్ మార్చాడు. మీడియం బడ్జెట్ లో ఇతర హీరోల సినిమాలకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబందించి వివరాలు త్వరలోనే వెల్లడి చేయనుంది చిత్రబృందం. ఈ సినిమా పూర్తవ్వగానే మహేష్ మరో సినిమాను కార్తీ హీరోగా నిర్మించడానికి సన్నాహాలు చేయిస్తున్నాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇలా వరుసగా ఇతర హీరోలతో సినిమాలు నిర్మించే ప్లాన్‌లో ఉన్నాడు మహేష్.
Published by: Suresh Rachamalla
First published: May 10, 2020, 6:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading