• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • MAHESH SAVES ONE MORE CHILD NAMRATA SHARES A POST ON INSTAGRAM SR

Mahesh Babu : దైవం మానుష్య రూపేణా.. మరో చిన్నారి ప్రాణాన్ని కాపాడిన మహేష్..

మహేష్ బాబు Photo : Twitter

Mahesh Babu : మహేష్ బాబు ఇప్పుడు ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నాడు. అయినా ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు.

  • Share this:
    మహేష్ బాబు ఇప్పుడు ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నాడు. అయినా ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు. గుండె సమస్య ఉన్న ఓ చిన్నారికి కావాల్సిన ఆపరేషన్ చేయించి ఆ చిన్నారి ప్రాణానికి అండగా నిలిచాడు. ఇదే విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత తెలిపింది. నమ్రత తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. మహేష్ ఇప్పటికే చాలా మందికి ఇలా అవసరమున్న చిన్నారులకు ఆపరేషన్ చేయించి ప్రాణాలు కాపాడాడు. ఈ తాజా ఆపరేషన్‌తో ఆయన 1016 వ చిన్నారుల ప్రాణాలను కాపాడినవాడైయాడు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి.. పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటగా వస్తోన్న ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. దీనికి సంబందించి ఇటీవల ఓ అధికారిక ప్రకటన కూడ విడుదలైంది. ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో విడుదల ఆయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంతో మహేష్ తన హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించాలని బలంగా ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో మొదలు అయ్యేది. కానీ అంత ఇపుడు తారుమారైంది.

    ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెలలోనే అమెరికాలో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, వీసా సమస్యల వలన కుదరలేదు. దీంతో ఇప్పుడు ప్లాన్‌ మారిందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో చిత్రీకరణ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఏకధాటిగా 45 రోజుల షెడ్యూల్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. సర్కారు వారి పాటలో విద్యా బాలన్ మహేష్‌కు సోదరిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కూడా నటించనున్నాడు. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక చిత్రం షూటింగ్ విషయానికి వస్తే, తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడ 45 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: