Home /News /movies /

MAHESH SARILERU NEKEVVARU NIZAM FIRST DAY COLLECTIONS SR

రికార్డ్ స్థాయిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు నైజాం కలెక్షన్స్

Twitter

Twitter

మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్, కామెడీ డ్రామా సరిలేరు నీకెవ్వరు  సంక్రాంతి సందర్భంగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

    మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్, కామెడీ డ్రామా సరిలేరు నీకెవ్వరు  సంక్రాంతి సందర్భంగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వరుస హిట్స్‌తో జోరుమీదున్న అనిల్ ఈ సినిమాను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా మలిచాడు. దీంతో మొదటి షో నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర అలరిస్తోంది. ఈ సినిమాలో ముఖ్యంగా అనిల్ తన బలమైన కామెడీని మిస్ చేయకుండా అప్పుడప్పుడూయాక్షన్ సీన్స్‌తో కావాల్సినప్పుడల్లా తగినమోతాదులో సెంటిమెంట్ డ్రామాతో సినిమాను ఎంగెేజింగ్‌గా తీశాడు. దీంతో అసలే సినిమాలు లేక సరైన ఎంటర్‌టైనర్ కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా తెగనచ్చేసిందని చెప్పోచ్చు. దీంతో నైజాంలో మొదటిరోజు సరిలేరు నీకెవ్వరు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో 8.66 కోట్ల షేర్ రాబట్టింది. ఈ కలెక్షన్స్ మహేష్ కెరీర్ లోనే బెస్ట్ నైజాం ఫస్ట్ డే ఓపెనింగ్‌గా నిలిచాయి. అయితే నైజాంలో  రికార్డ్ కలెక్షన్స్ రూపంలో.. ప్రభాస్ సాహో మొదటి స్థానంలో ఉండగా… బాహుబలి 2, సైరా తరువాత రెండు స్థానాల్లో ఉన్నాయి. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని విడుదలైన సరిలేరు నీకెవ్వరు రానున్న రోజులలో మరిన్ని మెరుగైన కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్షనల్ ఎబిలిటీస్ ఓ ఎత్తైతే.. మహేష్, రష్మిక మందనలు తమ వంతుగా సినిమాకు కావాల్సినంత గ్లామర్ తెచ్చారు. మరో కీలక పాత్రలో విజయశాంతి నటించి సినిమాకు ఎస్సెట్‌గా నిలిచారు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh, Sarileru Neekevvaru

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు