అడివి శేష్‌కు మహేష్ ప్రశంసలు... సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ అంటూ మెచ్చుకోలు...

అడివి శేష్, రెజీనా ప్రధాన పాత్రలో వచ్చిన 'ఎవరు' సినిమాను సోషల్ మీడియా వేదికగా మెచ్చుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

news18-telugu
Updated: August 26, 2019, 9:29 AM IST
అడివి శేష్‌కు మహేష్ ప్రశంసలు... సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ అంటూ మెచ్చుకోలు...
Photo : Instagram
  • Share this:
తెలుగు హీరోలు.. కొన్నాళ్లుగా  వేరే హీరోలు నటించిన సినిమాలు బాగుంటే.. .. ఎలాంటి ఈగోలకు పోకుండా..  వారికి నచ్చితే ఆ సినిమాను మెచ్చుకుంటున్నారు. పర్సనల్‌గా ఫోన్ చేయడమే కాకుండా.. సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశంసిస్తున్నారు. తాజాగా అడివి శేష్, రెజీనా ప్రధాన పాత్రలో వచ్చిన 'ఎవరు' సినిమాను మెచ్చుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.  ' 'ఎవరు' సినిమా చూసి థ్రిల్ అయ్యానని.. గొప్ప స్క్రీన్‌ప్లేతో .. అద్భుతంగా సినిమాను ఎగ్జ్‌క్యూట్ చేశారు.. అడివిశేష్ సహా ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు అంటూ మహేష్ ప్రశంసించారు.

దీనికి అడివిశేష్ స్పందిస్తూ... 'మేజర్' చిత్రంతో మిమ్మల్ని గర్వపడేలా చేస్తానంటూ.. మహేశ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అల్లు అర్జున్ కూడా  ‘ఎవరు’ సినిమాను మెచ్చుకున్నాడు.  ప్రతి సీన్ అద్భుతంగా ఉందని.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఉన్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారంటూ సినిమాను మెచ్చుకున్నారు స్టైలీష్ స్టార్.

వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిన ఎవరు సినిమా  ఆగస్ట్ 15న విడుదలై.. థ్రిల్లర్ కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరిస్తోంది. గతంలో కూడా అడివి శేష్ ‘క్షణం’,‘గూఢచారి’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాతో అడివి శేష్.. మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.  ఈ సినిమాలో అడివిశేష్‌తో పాటు రెజీనా కసాండ్ర, నవీన్ చంద్ర, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>