కూతురుతో మహేష్.. అబ్బురపరుస్తోన్న ఆ దృశ్యం..

కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా మహేష్ ఇంట్లోనే ఉంటున్నాడు.

news18-telugu
Updated: May 16, 2020, 11:58 AM IST
కూతురుతో మహేష్.. అబ్బురపరుస్తోన్న ఆ దృశ్యం..
సితారతో మహేష్ Photo : Twitter
  • Share this:
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురామ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఈ నెల 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటనతో పాటు పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. పరశురామ్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌‌ను వెతికే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా మొదట సారా అలీఖాన్ అని అన్నారు. ఆ తర్వాత కియారా అద్వానీ పేరు వినిపించింది. అయితే మహేష్‌తో కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుందని ఆమె దాదాపు ఖరారైందని టాక్. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా మహేష్ ఇంట్లోనే ఉంటున్నాడు. అది అలా ఉంటే మహేష్ తన కూతురు సితారతో ఆడుకుంటున్నా ఓ వీడియోను నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మహేష్ తన ముద్దుల కూతురు సితారతో ఆడుకుంటూ తెగ అల్లరి చేస్తున్నాడు. ఆ వీడియోను నమ్రత పోస్ట్ చేస్తూ.. 'ప్రేమ, జీవితం, నవ్వులు.. ఆయనలోని చిన్నపిల్లాడిని ఆమే బయటకు తీసుకురాగలదు' అంటూ సితారను ఉద్దేశిస్తూ నమ్రత ఆ పోస్ట్‌లో రాసుకుంది.



First published: May 16, 2020, 11:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading