హోమ్ /వార్తలు /సినిమా /

#SSMB27 : మహేష్‌తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ విలన్ కూతురు..

#SSMB27 : మహేష్‌తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ విలన్ కూతురు..

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు.. డిసెంబర్ వరకు మొదలు కాదు కూడా. ఎందుకంటే కోవిడ్ కొలిక్కి వచ్చే వరకు తాను ఇంటి నుంచి అడుగు బయట పెట్టేది లేదని ఇప్పటికే మహేష్ బాబు తన టీంకు చెప్పేసాడు కూడా.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాలేదు.. డిసెంబర్ వరకు మొదలు కాదు కూడా. ఎందుకంటే కోవిడ్ కొలిక్కి వచ్చే వరకు తాను ఇంటి నుంచి అడుగు బయట పెట్టేది లేదని ఇప్పటికే మహేష్ బాబు తన టీంకు చెప్పేసాడు కూడా.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాను అధికారికంగా మే 31న ఉదయం 9 గంటల 9 నిముషాలకు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సంరద్భంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు సంబందించి విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ చెవికి ఫోగు, మెడపై రూపాయి నాణెం టాటూతో లుక్ మొత్తం మార్చేశాడు. ఈ లుక్ చూస్తుంటే మహేష్ ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది.  స్కిప్టులో ఇటు మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా సెంటిమెంట్ సన్నివేశాలు రాసుకున్నాడట పరశురామ్. అందులో భాగంగా ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉంటుందని.. మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌‌గా కనిపించడమే కాదు.. కాలేజ్ స్టూడెంట్‌గాను అదరగొట్టనున్నాడట. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్స్ విషయానికి వస్తే.. మొదటినుండి ఈ సినిమాలో కియారా అద్వానీ నటించనుందని టాక్ నడిచింది. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వినిపించింది. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. సల్మాన్ ఖాన్ సినిమాలో దబంగ్ 3 మూవీలో హీరోయిన్‌గా చేసిన సాయి మంజ్రేకర్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఒక వేళా అదే నిజమైతే సాయికి బంపర్ ఛాన్స్ దక్కినట్లే. ఈ భామ ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురని తెలిసిందే. మహేష్ మంజ్రేకర్ తెలుగులో సాహో, ఒక్కడున్నాడు, అదుర్స్, వినయ విదేయ రామతో పాటు పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. ఇక ఈ చిత్రాన్ని మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ ప‌తాకాలు కలిసి నిర్మిస్తున్నాయి.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh babu, Sarkaru Vaari Paata, Tollywood Movie News

    ఉత్తమ కథలు