Home /News /movies /

MAHESH MABU SARKARU VAARI PAATA SVP HITS 1MILLION PLUS GROSS MARK AT US AMERICA BOX OFFICE HERE ARE THE DETAILS TA

Sarkaru Vaari Paata : యూఎస్‌లో 1 మిలియన్ మార్క్ అందుకున్న మహేష్ బాబు ’సర్కారు వారి పాట’..

యూఎస్‌లో ప్రీమియర్స్ తో 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళు చేసిన ‘సర్కారు వారి పాట’

యూఎస్‌లో ప్రీమియర్స్ తో 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళు చేసిన ‘సర్కారు వారి పాట’

Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట సినిమా మరో ఫీట్ అందుకుంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి 1 మిలియన్ యూఎస్ డాలర్లు గ్రాస్ వసూళు చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. ఇక ‘సర్కారు వారి పాట’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర నిర్మాతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాకు పాజిటివ్ వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలైంది. హీరోగా 27వ చిత్రం. నటుడిగా 36వ సినిమా.

    తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం. దీంతో  చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 38 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. మరోవైపు యూఎస్.. ఇతర ఓవర్సీస్ లెక్కలు చూసుకుంటే.. ఈ సినిమా మొదటి రోజు రూ. 50 కోట్ల షేర్.. (రూ. 80 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.


    ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో  వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు