ప్రతీసారి విమర్శలు చేస్తూ పబ్లిక్ టాక్‌గా మారిన కత్తి మహేష్.. చాలా రోజుల తర్వాత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన ఏకంగా చిరంజీవి కూతుర్నే టార్గెట్ చేశారు. ఇటీవల జరిగిన సైరా ప్రి రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సందడి చేశారు. సైరా సినిమాకు .. సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేశారు. దీంతో ఆమె ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ‘సైరా’ సినిమాలో కాస్ట్యూమ్స్ మరియు స్టైలింగ్ విభాగంలో పని చేసిన తన కూతురు సుస్మితను మెచ్చుకుంటూ మెగాస్టార్ పొగడ్తలు వర్షం కురిపించారు. ఆ తరువాత ఆమె కూడా స్టేజిపైకి వచ్చి సైరాలో పని చేసిన తన అనుభవాలు పంచుకున్నారు.
అమితాబ్ బచ్చన్‌తో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత (instagram/Photos)
అయితే నిజానికి ఆ సినిమాకు సుస్మిత గారితో పాటు మరొక అమ్మాయి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిందన్నారు కత్తి మహేష్. మెగాస్టార్ కూడా ఆ విషయమై కేవలం తమ కుమార్తె సుస్మిత గారి గురించి మాత్రమే మాట్లాడడం సబబు కాదన్నారాయన. ఈ విషయంపై తన సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కత్తి మహేష్ మరోసారి మెగా ఫ్యామిలీపై కీలక ఆరోపణలు చేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.